Minister Nimmala Ramanaidu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంస పాలన కారణంగా రాష్ట్రంలో 450 ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 1040 ఎత్తిపోతల పథకాలకు కనీసం మరమ్మతులు చేపట్లేదని విమర్శించారు. అందుచేత సగం ఎత్తిపోతల పథకాలు మూలం పడ్డాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఉన్న ఎత్తిపోతల పథకం నుండి సాగునీటిని విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కూడా పెద్ద విధ్వంసానికి గురైందని ఆరోపించారు. దయాప్రామ్ వాల్ విధ్వంసానికి కూడా గత ప్రభుత్వమే కారణమని విమర్శించారు.
Read Also: Eng vs IND: డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్..!
పోలవరం ప్రాజెక్టు మళ్లీ చూస్తామో లేదో అని ప్రజలకు అనుమానాలు కలిగిన సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు నిమ్మల.. ప్రస్తుతం వెంటి లెటర్ పై ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం ఏసీలోకి వచ్చింది.. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. చంద్రబాబు ముందు చూపు కారణంగా వరదలకు ముందే కొన్ని ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని అన్నారు. డయ ఫ్రమ్ వాల్ గ్యాప్ పనులు వచ్చే మార్చినాటికి పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కు సంబంధించి చిన్న పని కూడా గత ప్రభుత్వంలో చేపట్లేదని విమర్శించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కు పుష్కర ఎత్తిపోతల పథకం పురుషోత్తపట్నం ద్వారా నీళ్లు అందిస్తామన్నారు.. ఉత్తరాంధ్ర, ప్రజలకు, స్టీల్. ప్లాంట్ లకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం మాట్లాడే అర్హత వైసీపీకి లేదని, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను మంత్రి నిమ్మల ఖండించారు.