సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. వైఎస్ జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.. అంతేకాదు, సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
రైతులకు కూలి ఖర్చులు కూడా రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. వేంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉల్లి పంటను పరిశీలించారు.. అయితే ఉల్లి పంటికి గిట్టుబాటు ధర లభించడంలేదంటూ మాజీ సీఎంకు మొరపెట్టుకున్నారు రైతులు.. దళారులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు మద్దతు…
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో తమ కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ తర్వాత మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు జగన్.. ఆయనతో పాటు.. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో…
YS Jagan: ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరగా, జగన్ తన నిర్ణయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేశారు. Telangana Assembly News: తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ నాయకులు తమతో సంప్రదించారని, ముందుగానే వారికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చామని జగన్ తెలిపారు.…
‘సూపర్ సిక్స్’ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారని…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..
వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో ఆధిపత్యం కోసం టీడీపీ తమ్ముళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది... నిన్న మొన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలా? అని తలలు పట్టుకునే టీడీపీకి ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొనడంతో అదే తలనొప్పిగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎక్స్ లో స్పందించిన ఆయన.. ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగ్ నివేదికలపై ఎక్స్ లో ట్వీట్ చేశారు జగన్..