వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆరోగ్య శాఖ పై చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. మేమేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదన్న ఆయన.. ఎందుకు ఈ ప్రభుత్త హయాంలో 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదు..? అని ప్రశ్నించారు.. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అని.. ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందన్నారు..
అసెంబ్లీకి రాకుండా 'రప్పా.. రప్పా..' అంటూ బయట రంకెలేస్తున్నారు.. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడున్నది సీబీఎన్, పవన్ కల్యాణ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు..
అసలు, సొల్యూషన్ ఈవీఎంలది కాదు అన్నారు.. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ వస్తే న్యాయబద్ధంగా ఎన్నిక జరుగుతుందన్నారు.. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర భద్రతా బలగల పర్యవేక్షణ ఉంటుందన్నారు.. అప్పుడు ఎలాంటి మెకానిజం తీసుకువచ్చిన ఇబ్బంది లేదు అన్నారు.. అయితే, పేపర్ బ్యాలెట్ అయితే మరీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్.
యూరియా కొరత, రైతు సమస్యలపై వైసీపీ ఏపీ వ్యాప్తంగా అన్నదాత పోరు పేరుతో ఆందోళన చేపట్టింది. పార్టీ కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిందిని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని ఆంక్షలు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రైతులు భారీగా తరలి వచ్చారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు, ఉచిత బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతుల…
కేటీఆర్‌ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానన్న ఆయన.. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.