Shaik Mastan Vali: వైఎస్ఆర్ కలను నిజం చేయటానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను నిజం చేయటానికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొన్ని పార్టీల్లో భయం పట్టుకుందని విమర్శించారు. వైసీపీలో 2019కి ముందు రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎక్కడ ఉంది?, ఇప్పుడు ఎక్కడ పెట్టారు అని ప్రశ్నించారు. వైసీపీ మోసపూరిత వైఖరి నచ్చకనే షర్మిల ఆ పార్టీకి దూరమయ్యారని మస్తాన్ వలీ పేర్కొన్నారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ… ‘వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొన్ని పార్టీల్లో భయం పట్టుకుంది. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అనే విషయం సజ్జల రామకృష్ణారెడ్డి మరిచిపోయారు. వైసీపీలో 2019కి ముందు రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఎక్కడ ఉంది?, ఇప్పుడు ఎక్కడ పెట్టారు. వైసీపీ మోసపూరిత వైఖరి నచ్చకనే షర్మిల ఆ పార్టీకి దూరమయ్యారు. వివేకానంద రెడ్డి హత్యను అడ్డుపెట్టుకుని గత ఎన్నికల్లో ఓట్లు దోచుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో వివేక హత్య కేసు నిందితులను ఎందుకు పట్టుకోలేదు?’ అని ప్రశ్నించారు.
Also Read
Also Read: Kakani Govardhan Reddy: దళితులంటే ముందునుంచి చంద్రబాబుకు చిన్న చూపే: మంత్రి కాకాని
‘సీఎం జగన్ ప్రధాని మోడీకి పూర్తిగా లొంగిపోయారు. మోడీ దగ్గర జగన్ బానిస బతుకుతున్నారు. రాజశేఖర్ రెడ్డి కలను నిజం చేయటానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజశేఖర్ రెడ్డి మరణంపై సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ ఐదేళ్లలో అధికారంలో ఉండి ఎందుకు స్పందించలేదు. వైఎస్ఆర్ మరణంపై విచారణకై ఎందుకు డిమాండ్ చేయలేదు. కేవలం రాజకీయాల కోసం మళ్లీ ఇప్పుడు వైఎస్ఆర్ మరణాన్ని తెరపైకి తెచ్చారు’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!