కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు విడుదల చేయడం లేదని, విద్యార్ధులు చదువులు మానేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి దీవెన కూడా ఇవ్వట్లేదని, రూ.2200 కోట్లు బకాయి పెట్టారన్నారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా నిర్వీర్యం చేస్తున్నారని, ప్రతీ పిల్లాడు సొంతగా కారియర్స్ తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని, అందుకే ఆరోగ్యశ్రీని ఎత్తేశారని ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వంలో అన్నీ స్కాములే అని.. బాధ్యతల…
రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారు. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోష పెట్టాలని, రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు. పండుగలా ఉండాల్సిన వ్యవసాయం సీఎం చంద్రబాబు హయాంలో దండుగలా మారిందని ఎద్దేవా చేశారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఒక్క రైతుకూ పైసా పరిహారం రాలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై ఈరోజు జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు.…
ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. తాజా రాజకీయ పరిణామాలు, రైతాంగ సమస్యలపై జగన్ ప్రెస్‌మీట్ ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చ.. ఎస్ఐపీబీ ప్రతిపాదనలను ఈ నెల 11న జరిగే కేబినెట్‌లో ఆమోదించే అవకాశం ఇవాళ చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. చిత్తూరులో డీడీవో కార్యాలయం ప్రారంభించనున్న పవన్ రాజధాని కోసం రెండోవిడత ల్యాండ్ పూలింగ్ కోసం…
సినిమా డైలాగ్‌లు పోస్టర్లుగా పెట్టినందుకు కార్యకర్తలపై కేసులు పెట్టారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. నటులు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగ్‌లు ఎక్కువ ఉంటాయని.. మీకు అభ్యంతరాలు ఉంటే సెన్సార్ వాళ్లకు చెప్పి తీయించాలన్నారు. అసలు సెన్సార్ వాళ్లకు లేని అభ్యంతరం మీకు ఎందుకు? అని ప్రశ్నించారు. మంచి సినిమాలోని పాటలు పెట్టుకున్నా తప్పే.. డైలాగులు పెట్టుకున్నా తప్పే.. ఇలా అన్నా తప్పే, అలా అన్నా తప్పే.. ఏం చేసినా తప్పేనా?…
తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని, ఆ తర్వాత అన్నీ చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని తమపై అబాండాలేశారని, సీఎం చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్షా 75 వేల కోట్లు అప్పులు చేశారని…
ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందని, ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలిచ్చి ప్రజలను బాబు మోసం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం…
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్లో పాల్గొననున్నారు. కీలక ప్రెస్మీట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తాజాగా జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే? రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు, అక్రమ అరెస్టులు, తన పర్యటనలపై ఆంక్షలు సహా తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ…
ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: Today Astrology:…