YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వం చేయాల్సిన కనీస బాధ్యతల గురించి పట్టించుకోవటం లేదు.. ప్రజాస్వామ్యయుతంగా గొంతువిప్పే అవకాశం లేదా అని అడిగారు. రెడ్ బుక్ పాలనలో ప్రజలు మాట్లాడే పరిస్థితి లేదు.. దేశంతో పోలిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరుగమనంలో ఉంది.. విద్యా, వైద్యం, వ్యవసాయం ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతుంది అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు గురించి కూడా పట్టించుకోవటం లేదన్నారు. ఏపీలో పాలన ప్రజల కోసం జరుగుతుందా.. దోపిడీదారుల కోసమా అనేది ప్రశ్నార్థకంగా మారింది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read Also: Tomato Prices: కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. చావే శరణ్యమంటున్న రైతులు
అయితే, రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను బ్లాక్ మార్కె్ట్ లోకి తరలిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కదా. రెండు నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. అందుకే, రైతుల కోసం మా పార్టీ నేతలు నిన్న ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేశారని గుర్తు చేశారు. అర్థరాత్రి పోలీసులు వచ్చి మా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చి భయపెట్టారని పేర్కొన్నారు. రైతుల కోసం పోరాడితే తప్పేంటని ప్రశ్నించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ల తరపున పోరాటం చేయొద్దా అని అడిగారు. అసలు రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు చెప్పాలని వైఎస్ జగన్ క్వశ్చన్ చేశారు.