తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్ ను చిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు!? అంటూ సినీ సెలబ్రిటీలు ఇతర సెలబ్రిటీలపై వీసీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్ లకు బానిసలను చేసి ఎంతో మంది యువకుల మరణాలకు కారణం అయ్యారు. మీరు బెట్టింగ్ కు ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి…
జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.
Char Dham Yatra 2025: యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ల ‘‘చార్ ధామ్’’ యాత్ర మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ యాత్ర కోసం 9 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేదార్‌నాథ్ కి 2.75 రిజిస్ట్రేషన్లు, బద్రీనాథ్‌కి 2.2 లక్షల రిజిస్ట్రేషన్లు, గంగోత్రికి 1.38 లక్షలు, యమునోత్రికి 1.34, హేమకుండ్ సాహిబ్‌కి 8000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి.
Betting Apps : ఇంటర్నెట్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన తర్వాత, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు, వీటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు మియాపూర్ పోలీసులు మరింత ఉగ్రరూపం దాల్చారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన విచారణను వేగవంతం చేస్తూ పలు ప్రముఖ కంపెనీలపై కేసులు నమోదు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ను సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్లు భారీగా ప్రమోట్ చేయడం ఇప్పుడు పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఈ యాప్స్ పై దర్యాప్తు…
YouTube: నేడు యూట్యూబ్ ప్రజలను ఇంట్లో కూర్చొని లక్షాధికారులను చేస్తోంది. ఇంతకు ముందు ప్రజలు వెబ్‌సైట్‌ను రూపొందించడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకునేవారు. ఇప్పుడు YouTube ఛానెల్‌ని సృష్టించడం ద్వారా లక్షలు పోగేస్తున్నారు.
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలను ప్రస్తుతం సరళీకరించింది. ఇప్పటి వరకు మానిటైజేషన్‌కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించింది.
ఇటీవలే యూట్యూబర్ శ్రీకాంత్ పై కరాటే కళ్యాణి దాడి చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఆవీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ కావడంతో.. ఓరేంజ్ లో చర్చకు దారితీసింది. కరాటే కళ్యాణి శ్రీకాంత్ పై శ్రీకాంత్ కరాటే కళ్యాణిపై ఒకరి పై మరొకరు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టారు అధికారులు. కరాటే కళ్యాణి దగ్గర వున్న దత్తత తీసుకున్న పాపపై కేసు మలుపుతిరిగింది. ఎలా దత్తత తీసుకున్నారు అంటూ ఇంటి వరకు విచారణకు…