తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్ ను చిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు!? అంటూ సినీ సెలబ్రిటీలు ఇతర సెలబ్రిటీలపై వీసీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్ లకు బానిసలను చేసి ఎంతో మంది యువకుల మరణాలకు కారణం అయ్యారు. మీరు బెట్టింగ్ కు ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు.
Also Read: Nayanthara : నయనతార విడాకుల వార్తలు.. షాకింగ్ ఫొటో వదిలిందిగా!
దొంగతనాలు చేస్తూ నేరాల బాట పడుతున్నారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన మీరు ఈ సమస్యలకు ప్రధాన కారకులు కాదా!? ఆలోచించండి. కాసులకు కక్కుర్తి పడి.. సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటుపోయిన పర్లేదనే మీ ధోరణి సరైంది కాదు అని ఆయన అన్నారు. సినీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగాల్లో కలకలం సృష్టించిన బెట్ యాప్ స్కామ్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది.
Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కేసు.. డీజీపీని రప్పించాల్సి ఉంటుందంటూ హెచ్చరిక?
సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రివెంజన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 29 మంది ప్రముఖులు ఈడీ యొక్క జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారిలో ప్రముఖ టాలీవుడ్ నటులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లు ఉన్నారు. ఈ క్రమంలో వారిపై సజ్జనార్ కామెంట్స్ చేశారు.