విజయనగరంలో బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ (22) డీజే సౌండ్స్ కారణంగా మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్స్‌కు హరీష్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఆ యువకుడు అమెరికాకు వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇంతలోనే మృత్యువు ఆ యువకుడిని కబలించివేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన వేంపల్లి శ్రావణ్ గౌడ్ (27) సోమవారం రాత్రి 11.30 లకు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే… కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ శుక్రవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద టీఆర్ఎస్ ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ (23) అనే యువకుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే…