మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ప్లే చేసే విషయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు మరోసారి రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయం స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు లక్నో, కాన్పూర్ సహా రాష్ట్రవ్యాప్తంగా లౌడ్ స్పీకర్లను తొలగిస్తున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్ధతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తనకు మద్దతుగా తెలిపేందుకు విచ్చేసిన యోగి ఆదిత్యానాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా.. కుత్బుల్లాపూర్ గడ్డమీద అడుగుపెట్టినందుకు వారికి శిరస్సు వంచి స్వాగతం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగజ్‌నగర్ పట్టణంలో నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటించనున్నారు. బీజేపీ సిర్పూరు అభ్యర్థి డా.పాల్వాయి హరీశ్ బాబు ఏర్పాటు చేసిన ‘రామరాజ్య స్థాపన సంకల్పసభ’లో ఆయన పాల్గొని ప్రసంగించబోతున్నారు.
Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ గౌరవించడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అయోధ్యంలో శ్రీరాముడి జన్మస్థలంలో రాముడి ఆలయం వచ్చేదా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ తరుపున యోగి ప్రచారం చేశారు. ఎంపీలోని పావై, అశోక్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో దీపోత్సవ్ 2023 ఏడవ ఎడిషన్‌ను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని యూపీ సర్కార్ చూస్తోంది.
అర్హులైన కుటుంబాలకు వారి కుమార్తెల పెళ్లిళ్లకు ప్రభుత్వం 'ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన' కింద రూ.51,000 ఇస్తోందని తెలిపారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే రావణుడు, కంసుడి గతి పడుతుందని, తీవ్ర పరిణామాలు చవిచూస్తారని అన్నారు.
Yogi Adityanath: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అల్వార్ లో బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధాన్ని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో తాలిబాన్ ఆలోచనలను ఎలా అణిచివేయబడుతుందో మీరు చూస్తున్నారా..? ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధిస్తున్నారని ఇజ్రాయిల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్లకు బజరంగ్‌బలి విధానమే పరిష్కారమని ఆయన అన్నారు.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ప్రకటించారు. బులంద్‌షహర్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.632 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
Asaduddin Owaisi: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం మనా పాస్‌కు చేరుకుని సరిహద్దుల్లో మోహరించిన సైనికులతో సమావేశమయ్యారు.