కాగజ్‌నగర్ పట్టణంలో నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటించనున్నారు. బీజేపీ సిర్పూరు అభ్యర్థి డా.పాల్వాయి హరీశ్ బాబు ఏర్పాటు చేసిన ‘రామరాజ్య స్థాపన సంకల్పసభ’లో ఆయన పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఈ సభకు పలువురు కేంద్ర మంత్రులు సైతం హాజరవుతారని కమలం పార్టీ నేతలు తెలిపాయి. ఇక, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని నాయకులు, కార్యకర్తలను భారీగా సమీకరించేందుకు బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే, నిన్న వర్షం కారణంగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటన రద్దు కావడంతో.. కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు బీజేపీ శ్రేణులు చేస్తున్నారు.
Read Also: Rahul Gandhi: రాష్ట్రానికి మరోసారి రాహుల్ గాంధీ.. నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్ లో ప్రచారం
అయితే, తెలంగాణకు వచ్చే కంటే ముందే సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సిర్పూర్ అసెంబ్లీలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే, సీఎం యోగి గోరఖ్‌పూర్ లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తారు. గోరఖ్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన ప్రజా దర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హిమాచల్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు సిద్ధార్థనగర్‌లో పర్యటించనున్నారు. ఇక్కడ ఆయన బన్సీ తహసీల్‌లోని దీపర్, దేవ్‌గాలో ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు.