CM Yogi: లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ కంటే ముందు వెళ్తున్న యాంటీ డెమో వాహనం ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా ఓ కుక్క కారు ముందుకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
Best CMs: దేశంలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీకి తిరుగులేకుండా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తర్వాత ఎక్స్‌లో అత్యధిక మంది ఫాలోయింగ్ కలిగిన మూడో నేతగా ఉన్నారు. తాజాగా ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌నే ఎన్నుకున్నారు. 30 మంది సీఎంలలో ఆయన మొదటిస్థానంలో నిలిచారు. యోగికి 46.3 శాతం మంది బెస్ట్ సీఎం రేటింగ్ ఇచ్చారు. యోగి…
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మధుర, అయోధ్య గురించి మాట్లాడారు. రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజులు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతనను సంతరించుకున్నాయి. అయోధ్య నగరాన్ని గత ప్రభుత్వాలు నిషేధాలు, కర్ఫ్యూల పరిధిలో ఉంచాయని, శతాబ్ధాలుగా అయోధ్యను నీచ ఉద్దేశాలతో తిట్టారని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం బహుశా మరెక్కడ చూడలేదని, అయోధ్యకు అన్యాయం జరిగిందని యోగి అన్నారు.
Ayodhya Ram temple: అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు మాత్రం రామాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై బాంబుదాడులు చేస్తామని బెదిరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడా కార్యకలాపాలకు అద్భుతమైన వాతావరణం ఏర్పడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.
Rajasthan: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే రాజస్థాన్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ దాటి 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం మరో ‘యోగి’ ఎదుగుదలకు దారి తీసే అవకాశం ఏర్పడింది. రాజస్థాన్ యోగిగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మి నాయకుడు, అల్వార్ ఎంపీ బాబా బాలక్ నాథ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు.