ప్రధాని మోడీ వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న.. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.
Brij Bhushan Sharan Singh : ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన స్థానం కైసర్‌గంజ్ స్థానం. ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మహిళా రెజ్లర్లు తనపై లైంగిక వేధింపుల ఆరోపణలే ఇందుకు కారణం.
Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై విరుచుకుపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్‌పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు.
Yogi Adityanath: గోహత్యకు కాంగ్రెస్ అనుమతిస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల కోసం మహిళల సంపదను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షరియా చట్టం (ముస్లిం) తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CAA నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
UP CM Yogi Adityanath Deepfake Video: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘డీప్‌ఫేక్ వీడియోస్’ సంచలనంగా మారాయి. ఇప్పటికే ఎందరో సెలెబ్రిటీలు డీప్‌ఫేక్ వీడియోస్ బారిన పడ్డారు. కృత్రిమ మేధను ఉపయోగించి సృష్టిస్తున్న ఈ వీడియోలపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి వీడియోలు, ఫొటోల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టినా.. ఎలాంటి ప్రయోజనం లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డయాబెటిస్ ఔషధానికి సీఎం…