Yogi Adityanath: గోహత్యకు కాంగ్రెస్ అనుమతిస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల కోసం మహిళల సంపదను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆరోపించారు. దేశభక్తి నినాదాలు చేయడంతో వెనకాడే వారికి ఓట్లు వేయకూడదని యోగి ఓటర్లకు పిలుపునిచ్చారు. మైనారిటీలకు గోమాంసం తినే హక్కు కల్పించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, ఇది గోహత్యనున అనుమతించడమే అని యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు.
‘‘ఈ సిగ్గు లేని వ్యక్తులు గోమాంసాన్ని తినే హక్కును కల్పిస్తామని వాగ్దానం చేస్తారు. అయితే మన గ్రంథాలు ఆవును తల్లిగా పిలుస్తాయి. వారు ఆవులను కసాయిల చేతుల్లోకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. భారతదేశం దీనికి అంగీకరిస్తుందా..?’’ అని యోగిని ఉటంకిస్తూ యూపీ బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. మైనారిటీలకు తమకు నచ్చిన ఆహారాన్ని తినేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతున్నారు, అంటే వారు గోహత్యలను అనుమతించడం గురించి మాట్లాడుతున్నారని యోగి అన్నారు. సంభాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి పరమేశ్వర్ లాల్ సైనీకి మద్దతు కూడగట్టేందుకు మొరాదాబాద్ జిల్లాలోని బిలారిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆదిత్యనాథ్ ప్రసంగించారు.
Read Also: Earthquake: తైవాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు
ప్రధాని ఇటీవల కాంగ్రెస్‌పై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ.. మహిళల సంపదను స్వాధీనం చేసుకుని వాటిని రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు పంచాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రజల ఆస్తులనున సర్వే చేస్తామని మాట్లాడిందని పేర్కొన్నారు. ఒకరి ఇంట్లో నాలుగు గదులు ఉంటే అందులో రెండింటిని ఇస్తుందని, అంతే కాకుండా మహిళ ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోందని, దీన్ని దేశం ఎప్పటికీ అంగీకరించదని ఆయన అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004-14 వరకు ఇలాంటి ప్రయత్నాలనే చేసిందని యోగి ఆరోపించారు.
కర్ణాటకలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ముస్లింలకు కోటా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సచార్ కమిటీ సిఫార్సులను ఆయన ప్రస్తావిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాలో వారికి ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తో్ందని, దేశంలో వనరులపై ముస్లింకే మొదటి హక్కు ఉందని మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్ చెప్పారని ఆరోపించారు. దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని అన్నారు.