వ్యవసాయ ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కృష్ణా జలాల పంపిణీలో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.