Telangana News: కాళేశ్వరం లేకున్నా.. ధాన్యం దిగుబడిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ..
- పెరిగిన సాగు విస్తీర్ణం.. ధాన్యం దిగుబడిలో రికార్డు
- ప్రాజెక్టుల కింద పెరిగిన ఆయకట్టు
- కృష్ణా, గోదావరి జలాల వాటాలపై పంతం
- ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కృష్ణా జలాల పంపిణీలో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీఆర్ఎస్ హయాంలోని పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లు, విధ్వంసకర పరిస్థితులపై ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం సమర్పించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. లక్ష కోట్లతో అప్పటి ప్రభుత్వం నిర్మించి కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కుంగిపోయిన తీరుపై ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలోనే చర్చకు పెట్టింది. నీటిపారుదల రంగంలో పదేళ్లలో పెట్టిన ఖర్చులు, తెచ్చిన అప్పులు, ఆయకట్టు తీరుతెన్నులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ను నియమించింది.
సాగునీటిని అందించే ప్రాజెక్టులపైనే దృష్టి
గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రాధాన్యమిచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులపై ముందుగా ఫోకస్ చేసింది. రూ.241 కోట్ల ఖర్చుతో దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేలా పనులు ప్రారంభించింది. 2025 మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. గోదావరి బేసిన్ లో ఉన్న చిన్న కాళేశ్వరం, మోదికుంట, లోయర్ పెన్ గంగా, చనాక కోరాట, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, కృష్ణా బేసిన్ లో కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ పనులు ఈ ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే దేవాదుల ఎత్తి పోతల ప్రాజెక్టుకు అవసరమైన 2,947 ఎకరాల భూసేకరణ చేపట్టి.. 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫోకస్..
గత ప్రభుత్వం మొట్టమొదటగా కొబ్బరికాయ కొట్టి అసంపూర్తిగా వదిలేసిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఆర్థిక సాయం అందించాలని అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకంలో ఈ ప్రాజెక్టును చేర్చి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆగస్ట్ 15వ తేదీన ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. గత ప్రభుత్వం రూ. 7400 కోట్లు ఖర్చు పెట్టి.. ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వకుండా వదిలేసిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 482.87 కోట్లతో ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసింది. 9 కిలోమీటర్ల రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సీతారామ నీటిని నాగార్జునసాగర్ కెనాల్ కు అనుసంధానం చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించటం రికార్డు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం విస్మరించింది. ఎస్ఎల్బీసీ పనులను ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి అత్యాధునిక యంత్ర పరికరాలను విదేశాల నుంచి తెప్పించింది. 2027 సెప్టెంబర్ లోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో రూ. 4,658 కోట్లు కేటాయించింది.
నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు..
2014కు పూర్వం ప్రతిపాదించిన నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఫిబ్రవరి నెలలోనే ప్రజా ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తో పాటు మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు రూ.4350 కోట్లు కేటాయించింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు తో పాటు సీతారామ లిప్ట్, సమ్మక్క-సారక్క ప్రాజెక్టు కు అవసరమైన అనుమతులను తెచ్చుకునేందుకు ప్రభుత్వం కేంద్రంతో, మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు పడి ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. లోపాలను గుర్తించి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యల బాధ్యతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ)కి అప్పగించింది. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలోని సిఫారసుల ఆధారంగా వానాకాలం ప్రారంభానికి ముందే బరాజ్‌లకు అత్యవసర మరమ్మతులు నిర్వహించింది. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో చుక్క నీటిని నిల్వ చేయలేదు.
ఈ వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు..
కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండానే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల కింద రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు. యాసంగిలో కూడా 42.11లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం ఇటీవలే సాగునీటి ప్రణాళికను విడుదల చేయటం గమనార్హం. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని, ఈ నీటిని వినియోగించేలా చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. నీటి వాటాలు, గోదావరి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని అధికారం చేపట్టినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో అడుగులేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా.. ఏపీలో కేవలం 30 శాతం ఉంది. అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం కృష్ణా జలాల్లోని 1005 టీఎంసీల్లో 70 శాతం రాష్ట్ర వాటా సాధించేలా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించటం గమనార్హం.
తాజావార్తలు
-
Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!