మూడు రాజధానుల చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు పాదయాత్ర చేపట్టారు. మూడు రాజధానులకే మా మద్దతు అని వైసీపీ చెబుతుంది.
మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు. ఎవరి కుంపటి వారిదే. అధిష్ఠానం మందలించినా నేతల తీరు మారడం లేదట. అదేదో సాధారణ నియోజకవర్గం కాదు. పెద్ద పొజిషన్లో ఉన్న సీనియర్ పొలిటీషియన్ సెగ్మెంట్ కావడంతో రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఏమా అసమ్మతి గోల? లెట్స్ వాచ్..! శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరుచోట్ల వైసీపీ పాగా వేసింది. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. ఆ ఆరు చోట్లా ఎమ్మెల్యే పేరు చెబితేనే…
పోయినచోటే వెతుక్కోవాలని జనసేనాని చూస్తున్నారా? అందుకే ఆ నియోజకవర్గంపై మళ్లీ ఫోకస్ పెడుతున్నారా? మరోసారి బరిలో దిగుతారా లేక.. అక్కడ పార్టీని బలోపేతం చేస్తారా? కొత్త ప్లాన్ వర్కవుట్ అయ్యేనా? ఏంటా వ్యూహం? లెట్స్ వాచ్..! భీవమరం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీ చేయడమే ఆ ఆసక్తికి కారణం. అవే ఎన్నికల్లో గాజువాక నుంచి కూడా పవన్ కల్యాణ్ బరిలో ఉన్నప్పటికీ.. ఎక్కువ…
పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో భూములకు డిమాండ్ ఎక్కువ. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు.. కోవూరు.. విడవలూరు మండలాల్లో గ్రావెలతోపాటు ఇసుక అధికంగా లభిస్తుంది. ఇవే స్థానిక వైసీపీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సైతం ప్రస్తుతం చర్చగా మారింది. అధికారపార్టీ వర్గాల్లోనే కుమ్ములాటలకు.. వర్గపోరుకు.. కేడర్‌కు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరగడానికి కారణమైందని చెబుతున్నారు. కోవూరు నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ నేతలను ఇంఛార్జులుగా నియమించారు…
2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం పోలవరం. 42 వేల ఓట్లకుపైగా మెజార్టీతో నాలుగోసారి గెలిచారు తెల్లం బాలరాజు. అయితే ఎన్నికల తర్వాత నుంచి మారుతున్న పరిణామాలతో నియోజకవర్గంలో అధికారపార్టీ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, పునరావాస కల్పన గతంకంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. నియోజకవర్గ అభివృద్ది విషయంలో ఆశించిన ఫలితాలను రాబట్టడంలో ఎమ్మెల్యే వెనకపడ్డారన్నది పార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ విషయంలో వైసీపీ లోకల్ లీడర్సే బాలరాజుపై…
అధికారులు బదిలీపై వెళ్తే.. లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యే, కలెక్టర్, లేదా మంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మాత్రం పూర్తి డిఫరెంట్. ఇక్కడికి ఎవరొచ్చినా.. ఏం జరగాలన్నా ముందుగా ఎమ్మెల్యే సోదరులను కలవాలట. ఇక్కడ ఎమ్మెల్యే మొన్నటి వరకు మంత్రిగా చేసిన శంకర నారాయణ. తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచినా.. 2019లోనే కేబినెట్లో చోటు కొట్టేశారు. ఇందుకు సామాజికవర్గం సమీకరణాలు కలిసొచ్చాయి. శంకర నారాయణ ఎమ్మెల్యే కాకముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కూడా. ఆ సమయంలో…
విశాఖ జిల్లా వైసీపీలో కో-ఆర్డినేటర్లకు గడ్డుకాలం నడుస్తోంది. పశ్చిమ, దక్షిణ స్ధానాల్లో ఇంఛార్జుల పంచాయితీ చల్లారక ముందే.. తాజాగా తూర్పు నియోజకవర్గంలో తిరుగుబాటుకు చాప కింద నీరులా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అధికారపార్టీకి తూర్పు నియోజకవర్గం చాలా కీలకం. ఇక్కడ వరసగా మూడుసార్లు టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లోనే సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం రచించినా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అక్కడి టీడీపీలో అంతర్గత బలహీనతలు బయటపడి పరిస్థితిని మార్చేస్తున్నాయి.…
రాజధానిలో కీలక ప్రాంతం గుంటూరు. మున్సిపల్ కార్పొరేషన్లో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై కోర్టుకు వెళ్లడంతో గుంటూరు కార్పొరేషన్‌కు పదేళ్లపాటు ఎన్నికలు జరగలేదు. ఆ సమయంలో అధికారులే కీలకంగా మారారు. గుంటూరు అభివృద్ది కూడా నత్తనడకన సాగింది. ఏడాదిన్నర క్రితం ఎన్నికలు జరగడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని జనం ఆశించారు. కొత్త పాలకవర్గం కొలువుదీరింది కానీ.. సీన్ మాత్రం మారిపోయింది. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచామని.. ఇప్పుడు పదవి…