దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనకు ఊతమివ్వడానికి సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ 27 న భారత్ బంద్‌కు సిద్ధమవుతోంది. ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయం అభివృద్ధి కోసం కాదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల ఆందోళనకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. ఏపీలో ఈ నెల 27న జరుగుతున్న భారత్ బంద్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని మంత్రి…