2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం పోలవరం. 42 వేల ఓట్లకుపైగా మెజార్టీతో నాలుగోసారి గెలిచారు తెల్లం బాలరాజు. అయితే ఎన్నికల తర్వాత నుంచి మారుతున్న పరిణామాలతో నియోజకవర్గంలో అధికారపార్టీ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, పునరావాస కల్పన గతంకంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. నియోజకవర్గ అభివృద్ది విషయంలో ఆశించిన ఫలితాలను రాబట్టడంలో ఎమ్మెల్యే వెనకపడ్డారన్నది పార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ విషయంలో వైసీపీ లోకల్ లీడర్సే బాలరాజుపై…
ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. కీలక నియోజకవర్గంలో గెలిచారు. ఇక తనకు తిరుగే లేదని అనుకున్నారో ఏమో.. క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్. కేడర్‌నే కంట్రోల్ చేయలేకపోతున్నారట. పైగా ఒక వర్గాన్ని వెనకేసుకొస్తున్నారని ఆరోపణలు. ఇకేముందీ.. రెండోవర్గం టైమ్ కోసం ఎదురు చూస్తోందని ఒక్కటే గుసగుసలు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎమ్మెల్యేపై వైసీపీలోని మరోవర్గం గుర్రు..! కొఠారు అబ్బయ్య చౌదరి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కోటను వైసీపీ గాలిలో బద్దలుకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు.…
ఆ నియోజకవర్గంలో అధికారపార్టీకి ఇద్దరు కీలక నాయకులు ఉన్నారు. ఇద్దరు కలిసి సాగితే ఏ గొడవా ఉండేది కాదు. ఆధిపత్యం కోసం కుస్తీపట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీ ఒకటే కానీ.. రెండు కార్యాలయాలు.. రెండు గ్రూపులు. మూడేళ్లుగా ఇదే తంతు. సమస్య ఏదైనా వాళ్ల మధ్య అగ్గి రాజేస్తుంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం? ఆధిపత్యం కోసం ఇద్దరు నేతల ఫైట్..! అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణను ఎదుర్కొనేందుకు వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది.…
విజయనగరం వైసీపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొత్త నీరు పార్టీలో పెత్తనం చేయబోతోందా? సొంత కుటుంబ సభ్యులే శత్రువుతో చేతులు కలిపారా? బంధువుల మధ్య తలెత్తిన ఆధిపత్యపోరు చినికిచినికి గాలివానగా మారుతోందా? ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత వీటన్నింటిని ఎలా చూస్తున్నారు? ఏం జరుగుతోంది? బొత్స సొంత జిల్లాలో మేనల్లుడి హవా? విజయనగరం జిల్లా పేరు చెబితే బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. రాజకీయ నేపథ్యం ఏ మాత్రంలేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స…
ఏదైనా గొడవ జరిగితే పోలీసులకు చెబుతా.. కేసు పెడతా అంటారు కొందరు. దీంతో ఎదుటి పక్షం భయపడుతుందనేది వాళ్ల అభిప్రాయం. ఆ నియోజకవర్గంలోనూ అంతే..! కాకపోతే ఖాకీల పేరు చెప్పి కాసులు వెనకేసుకుంటున్నారట అధికారపార్టీ నేతలు. వర్గపోరు శ్రుతి మించి రోడ్డెక్కుతున్నారు. పోలీసుల పేరుతో పార్టీ నేతల వసూళ్లు? కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. ఇదే నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి. ఎవరి వర్గం వారిదే. మొదటి నుంచి అస్సలు పడటం…
ఆ యంగ్ ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షాక్ ఇస్తున్నాయా? రెబల్స్ వర్సెస్ ఎమ్మెల్యే వార్ హోరెత్తుతోందా? విపక్షం స్పీడ్ పెంచడంతో.. ఇంటా, బయటా ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదా? ఇంతకీ ఈ కుమ్ములాటలకు కేంద్రం ఎక్కడుంది? ఏంటా పంచాయితీ? పాడేరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు..! విశాఖ జిల్లాలో ఎస్టీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన పాడేరు మన్యం ప్రాంత రాజకీయాలకు కేంద్ర బిందువు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ ఆధారంగా ఫలితాలు వచ్చాయి. 2014లో…
కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో విబేధాలు రచ్చకెక్కాయా? సమన్వయం లేక నాయకులే బజారున పడుతున్నారా? ఆధిపత్యపోరు వైఎస్ విగ్రహాన్ని కూల్చేవరకు వెళ్లిందా? లోకల్ సెగలు.. ఇంకెలాంటి మలుపు తిప్పుతాయో పార్టీ వర్గాలకు బోధపడటం లేదా? ఏ విషయంలో పార్టీ నాయకుల మధ్య గ్యాప్ వచ్చింది? లెట్స్ వాచ్! కోడుమూరు వైసీపీలో వర్గపోరు సెగలు..! కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడది పరిషత్ ఎన్నికల…
అప్పట్లో ఇంఛార్జ్‌గా ఉన్న నాయకుడు.. తిలకం దిద్ది మీకే పోస్ట్ అని హామీ ఇచ్చారు. ఇంతలో ఆ ఇంఛార్జే మారిపోయి కొత్త నేత వచ్చారు. అసలే పాత, కొత్త ఇంఛార్జుల మధ్య ఆధిపత్య పోరు ఉండటంతో గత హామీలపై ఆ ఎఫెక్ట్ పడింది. పరిషత్ ఫలితాల తర్వాత రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గం ఏంటో.. వారెవరో ఇప్పుడు చూద్దాం. దువ్వాడ, పేరాడ మధ్య నందిగాం పంచాయితీ! శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీలో నాయకులెక్కువ. వారి మధ్య…
అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటర్నల్ పాలిటిక్స్ దెబ్బతీశాయి. పార్టీ అధికారంలోకి రావడంతో బలపడేందుకు ఛాన్స్ దక్కిందని సంబర పడ్డారు. కానీ సీన్ రివర్స్. నిత్యం ఏదో ఒక అంశంపై లడాయి. లోకల్‌గా వైరిపక్షాన్ని ఇరుకున పెట్టడానికంటే.. సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువైయ్యాయట. ఆ నియోజకవర్గం ఏంటో..అక్కడ గొడవలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇచ్ఛాపురం వైసీపీలో నిత్యం ఏదో ఒక తగువు! శ్రీకాకుళం జిల్లా వైసీపీలో గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు ఇచ్ఛాపురం. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. 2019లో…