ఒకరు చేతికి ఉంగరం పెట్టుకున్నారు. ఇంకొకరు కనిపించిన దేవుడికి మొక్కుతున్నారు. ఏకంగా గుడే కట్టించేశారు మరొకరు. వీటన్నింటికీ మూల మంత్రం ఒక్కటే. రేస్‌లో ముందుకెళ్లడమే. కొత్త పదవి చేపట్టడం.. లేదా ఉన్న పదవిని కాపాడుకోవడం. ఆ జిల్లాలో అధికారపక్ష నేతలు చేస్తున్న ఈ విన్యాసాలే ఇప్పుడు ఆసక్తిగా మారాయి. సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం? దేవుడు కరుణించాలి. వరాలు కురిపించాలి. సామాన్య భక్తులు ఈ ఆశతోనే గుళ్లకు వెళ్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. రాజకీయ నాయకులైతే…
దళితుల గురించి చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి. దళితుల గురించే మాట్లాడే నైతికత, అర్హత చంద్రబాబుకు లేదు. దళితులను అవమానించినందుకు అంబేద్కర్ విగ్రహం ముందు చంద్రబాబు ముక్కు నేలకు రాయాలి అని వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళితులపై దాడులు ఆరోపణలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. బలంగా ఉన్న దళితులను విభజించి పాలించాలనేది చంద్రబాబు నైజం. దళితులను వాడుకుని వదిలేయడమే చంద్రబాబు పని. రాజధానిలో దళితులకు ఇళ్లపట్టాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు…
ఏ పదవులు చేజారి పరువు పోగొట్టుకున్నారో.. ఇప్పుడు అవే పదవులను పట్టేసి పట్టు నిలుపుకొన్నారట ఆ ఎమ్మెల్యే. హైకమాండ్ కూడా ఎందుకొచ్చిన గొడవ అనుకుందో లేక ఎమ్మెల్యేకే ప్రయారిటీ ఇవ్వాలనుకుందో.. మొదట్లో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చేసింది. ఆలస్యంగానైనా పైచెయ్యి సాధించానని చెప్పుకొంటూ సదరు ఎమ్మెల్యే, ఆయన వర్గం జబ్బలు చరుచుకుంటోందట. గెలిచిన కొత్తలో సఖ్యతగా ఉండేవారు! పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి జిల్లాలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం. 2 లక్షల 50 వేల…
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రతిపక్ష పాత్రకే పరిమితం. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా లాభం లేదట. ఇదే సమయం అనుకున్నారో ఏమో అక్కడ షాడోల పెత్తనం పెరిగిపోయిందట. అసలు కంటే కొసరకే ఎక్కువ డిమాండ్ ఉందట. ఎవరో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. పనికావాలంటే బాబు లేదా శ్రీను దగ్గరకు వెళ్లాల్సిందేనా? శ్రీకాకుళం జిల్లా రాజాం. ఇక్కడి ఎమ్మెల్యే కంబాల జోగులు. 2014లో జిల్లాలో టీడీపీ గాలి వీస్తే రాజాంలో జోగులు వైసీపీ నుంచి…
ఎమ్మెల్యేగా ఆయన సీనియర్. పదవుల దగ్గరకు వచ్చేసరికి తనను జూనియర్‌గా చూస్తున్నారనే ఆవేదన ఉందట. ఈసారి మాత్రం లెక్కలు సరిచేస్తారని భావిస్తున్న తరుణంలో మరో నాయకుడి నుంచి పోటీ కలవర పెడుతోందట. ఎవరికి వారుగా ఆశల పల్లకిలో విహరిస్తుండటంతో.. పదవిరాని వారి పరిస్థితి ఏంటి? పార్టీపై ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? అని మరికొందరు లెక్కలు వేస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? నల్లారి కుటుంబంపై గెలుస్తున్నా గుర్తింపు లేదా? చింతల రామచంద్రారెడ్డి.చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. 2014, 2019…
రెండు సంవత్సరాలలో అని సంక్షేమ పథకాలు అమలు చేశాం. దాదాపు 90 శాతం పూర్తి చేశాం. మిగిలిన 10 శాతం కూడా అమలు చేస్తాం. ప్రజలు నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసినందుకు వారికి న్యాయం చేస్తున్నాం అని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంథంగా భావించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. కరోనాతో తల్లితండ్రులు చనిపోయిన పిల్లలకు 10 లక్షల ఆర్థిక సహాయం ఆదిస్తుంది ప్రభుత్వం. తల్లిదండ్రులలో ఒక్కరూ చనిపోయిన…
రెండేళ్ళల్లో సీఎం జగన్ పరిపాలనపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ… ప్రతి పార్లమెంటు స్థాయిలో ఓ మెడికల్ కాలేజీ , ప్రైవేటు రంగంలో రాజమండ్రి- లోమెడికల్ హబ్ లు ఏర్పాటుకై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బిసీ,ఎస్సీ,మైనారిటీలు కు నామినేటెట్ పదవులలో ప్రాధాన్యం ఇచ్చినట్లు… బిసీవర్గాలను ఆదుకోవడానికై 50 బిసీకార్పొరేషన్లు ఏర్పాటు చెసినట్లు పేర్కొన్నారు. రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తున్నారు. వ్యవసాయ, విద్య,వైద్య రంగాలకు సీఎంజగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాలరైతులకు అండగా వుండేందుకే అమూల్ తో…
కరోనా తగ్గుతున్న వేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారా ఆ విషయాన్ని రాజకీయం చేయాలా అని తండ్రి కొడుకులు ఆలోచిస్తారు. చంద్రబాబు రాబందులా… చనిపోయిన వారికి పెట్టే పిండం తినడానికి వచ్చే కాకిలా లోకేష్ తయారయ్యారు అని తెలిపారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు అతని తనయుడు రాజకీయ కుట్రలు చేశారని అందరికీ తెలుసు. కుట్రలో చిక్కుకున్నానని డాక్టర్ సుధాకర్ అప్పుడే…
రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి కుట్ర పన్నారు. గత ఏడాది కాలంగా ఢిల్లీలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ ల పేరుతో కులాల మధ్య విద్వేషాలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు అని ఎన్టీవీతో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పైకి రఘురామ కృష్ణంరాజు ఉన్నా వెనుక చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, కొన్ని ఛానల్స్ ఉన్నాయి అని పేర్కొన్నారు. ఏడాది కిందటే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయమని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశాం…