నెల్లూరు జిల్లా ఉదయగిరి. ఇక్కడ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. ఈ మధ్య తరచూ వార్తల్లో.. ప్రచారంలో ఉంటున్న శాసనసభ్యుడు. వివాదాలు కోరుకుంటున్నారో ఏమో.. అవి లేకుండా చంద్రశేఖర్‌రెడ్డి పేరు ఉదయగిరిలో వినిపించదు. ఈ కోవలోనే చర్చల్లోకి వస్తోంది ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి యవ్వారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంత చెబితే అంత కాదు.. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. దాంతో ఆయనకు ఎమ్మెల్యే షాడో అనే గుర్తింపు వచ్చేసిందిట. ఏ పని కావాలన్నా మొదటిగా…
ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. రాజధానిపై శాసన అధికారం తీసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం తనను బాధించిందని లేఖలో ధర్మాన తెలిపారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పరిధులను స్పష్టంగా నిర్ణయించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య…
భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు చేస్తున్న వేళ.. వైసీపీ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. టిక్కెట్ రేట్లు కావాలనే పెంచకపోవడం, అదనపు షోలకు అనుమతులు ఇవ్వకపోవడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇలా పలువురు నేతలు పవన్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. జగన్ హీరోగా సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన…
కరోనా రక్కసి ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్నారు. ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసుల సంఖ్యం దేశవ్యాప్తంగా పెరుతూవస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలుగువారికి ప్రత్యేకమైన సంక్రాంతి పండుగను పురస్కరించికొని నైట్ కర్ఫ్యూను 18వ తేదీ నుంచి పెడుతున్నట్లు…
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ కాసేపటి కిందట సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే విరాట్ కోహ్లీ ప్రకటనపై ఏపీలోని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు. ఇలాంటి వార్తను కచ్చితంగా ఇప్పుడు తాము వినాలనుకోలేదని ఎమ్మెల్యే విడదల రజనీ అభిప్రాయపడ్డారు. కానీ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు. Read Also: బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!! భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అందించిన…
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను అక్రమాలు చేస్తే నిరూపించాలి ఒట్టి మాటలు మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యారు. మా మామ కమ్యూనిస్టు కృష్ణారావు పేరు మీద ఎయిర్‌పోర్టు వద్ద 200 ఎకరాలు ఉన్నాయన్నారు. అది నిరూపిస్తే.. 200 ల ఎకరాలను ఆర్డీటీ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ర రెడ్డితో పాటు ఆయన సోదరుల పేరు మీద ఎన్నో ఆస్తులున్నాయని పరిటాల…
సినిమా వాళ్లపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. సినిమా వాళ్లను బలిసింది అనడం బాధాకరమని… నిజనిజాలు తెలియకుండా ఓ ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడటం తెలుగు సినిమా పరిశ్రమ మొత్తాన్ని అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేసింది. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమేనని.. మిగతా సినిమాలు…
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌ను విమర్శిస్తూ ఆమె మాట్లాడటం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. అంబేద్కర్ వల్ల మనకు ఎలాంటి హక్కులు రాలేదన్నారు. అంబేద్కర్ వల్ల సాధ్యం కానివి బాబూ జగ్జీవన్ రాం వల్ల సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించారు. Read Also: అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట ఈరోజు మనకు రాజ్యాంగ హక్కులు…
ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఆ ఎమ్మెల్యే విస్మరించారా? ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారా? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఉదయగిరి వైసీపీలో వర్గపోరు తీవ్రం..! మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే. వైసీపీ నేత. విపక్షపార్టీలు ఆందోళన చేయాల్సిన చోట.. తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైసీపీ కేడర్ రోడ్డెక్కుతున్న పరిస్థితి ఉదయగిరిలో ఉంది. పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలు ఎమ్మెల్యేకు.. కేడర్‌కు…
ఆయనో అధికారపార్టీ ఎమ్మెల్యే. వరసగా రెండోసారి గెలిచారు. కాకుంటే కాస్త డిఫరెంట్. పార్టీలో ఉంటారు.. అప్పుడప్పుడూ పార్టీకి గిట్టని పనులు కూడా చేస్తుంటారు. మరోసారి టికెట్ రాదని అనుమానం వచ్చిందో ఏమో .. ముందే జాగ్రత్త పడుతున్నారని ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను అందుకు సంకేతాలుగా చెబుతున్నారు. మరి.. ఆ ఎమ్మెల్యే కొత్తదారిలో ప్రయాణిస్తారా? కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలోనే అసంతృప్తి ఉందా? కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో ఆయన…