నేడు ( ఆదివారం ) మూడో రోజు నాలుగు వేదాలకు సంబంధించి వేద పండితులు వేద పట్టాన్ని సీఎం పూర్ణహూతి చేసే సమయంలో పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మేము అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది రుత్వికులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు అని ఆయన అన్నారు.
Prathipati Pulla Rao: ఏపీ రాజధాని విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా బుద్ధి రాదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా.. ఏ కోర్టుకు వెళ్లినా అమరావతి ఒక్కటే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని ప్రత్తిపాటి పుల్లారావు…
ఒక రాజకీయ పార్టీకి విశ్వసనీయత మేనిఫెస్టో అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతి హామీ మతగ్రంథంగా పవిత్రంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు పవిత్రమైనవిగా భావిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
కుప్పానికి నీళ్లివ్వని ముఖ్యమంత్రి జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్ కాలనీలో ఆయన పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్నారు. ఎవ్వరూ ఊహించని పరిణామాలు ఏపీలో చోటు చేసుకోబోతున్నాయని ఆయన వెల్లడించారు.