Daggubati Purandeswari Criticized YCP Government
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో బీజేపీ ప్రజాపోరు కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధరీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాతండ్రి ఎన్టీఆర్ మీద ప్రజలకు ఉన్న అభిమానం ఆత్మసంబంధమన్నారు. అవినీతితో నిండిన పాలనను ప్రశ్నించడమే ప్రజాపోరు అని ఆమె వెల్లడించారు. ప్రజల గొంతుకగా నిలిచేందుకు బీజేపీ పొరాటం చేస్తుందని, మూడేళ్లు అధికారంలో ఉంది.. రాష్ర్ట అభివృద్ది రివర్స్ అయ్యిందన్నారు. ఎన్నికల ముందు రివర్స్ టెండర్ చేస్తాను డబ్బులు ఆదాచేస్తానని, రెండున్నర లక్షల కోట్ల అప్పును ఎనిమిది లక్షల కోట్లుకు పెంచారన్నారు. ఉద్యోగం ఇస్తానన్నారు ఈరోజు పరిస్దితి ఏంటని ఆమె ప్రశ్నించారు. బిడ్డలకు ఉద్యొగాలు వచ్చే పరిస్థితిలేదని, రాష్ర్టంలో ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని వాటాలు అడిగితే, పారిశ్రామిక వేత్తలు ఎందుకు వస్తారని ఆమె విమర్శించారు.
అరాచక ప్రభుత్వం రాష్ర్టంలో ఉందని, మద్యపాన నిషేదం అన్నారు, మద్యం షాపులలో డిజిటల్ పేమెంట్స్ లేవు.. అ డబ్బంతా కొందరి జోబుల్లొకి వెలుతుందని ఆమె ఆరోపించారు. రాష్ర్టం దోపిడి వ్యవస్దలా మారిందని, రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. వైసీపీని గద్దెదించాలని, 2024లో బీజేపీనీ అధికారంలొకి తీసుకురావాలన్నారు. 370 అధికరణ తొలగించడం, రామమందిరం నిర్మాణం కోసం బీజేపీ కృషి చేసిందని ఆమె వ్యాఖ్యానించారు.