నేడు ( ఆదివారం ) మూడో రోజు నాలుగు వేదాలకు సంబంధించి వేద పండితులు వేద పట్టాన్ని సీఎం పూర్ణహూతి చేసే సమయంలో పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మేము అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది రుత్వికులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు అని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇటువంటి యజ్ఞం జరగలేదు అని మంత్రి కొట్టు తెలిపారు. ప్రతినిత్యం మంగళ వాయిద్యాలతో వేదానికి తగ్గట్లు వాయిస్తూ ఘనంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
Also Read : Satyavathi Rathod : మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించిన సత్యవతి రాథోడ్
హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఛాలీసాను ఘనంగా నిర్వహించాం అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. యాగానికి వినియోగంచే నెయ్యిని దేశీయ ఆవుల నుంచి రాజస్తాన్ నుంచి నెయ్యి తెప్పించామని చెప్పారు. అత్యంత జాగ్రత్తలతో పవిత్రమైన సంకల్పంతో రాష్ట్ర ప్రజల సంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్వహిస్తున్నాం అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Also Read : Priyanka Chopra: ‘కజిన్’ ఎంగేజ్మెంట్ లో ప్రియాంక సందడి…
నేడు ( ఆదివారం ) అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. పూర్ణహుతి అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము.. నేటి నుంచి అమ్మవారికి పూజ చేసిన పసుపు కుంకుమ, గాజులను మహిళ భక్తులకు అందిచనున్నట్లు చెప్పుకొచ్చారు. రేపు ( సోమవారం ) లక్ష్మి స్తోత్ర పారాయణం, సప్త నదుల నుంచి మూడు సముద్రాలు, మానసారం నుంచి జలాలు తెప్పించి అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తామని మంత్రి కొట్టు చెప్పుకొచ్చారు.
Also Read : Badruddin Ajmal: బీజేపీని ఓడించేందుకు త్యాగానికి సిద్ధం.. విపక్షాల ఐక్యతకు మద్దతు
రేపు సాయంత్రం శ్రీశైలం భ్రమరాంభ అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రేపు పెద్ద జీయంగార్, పుష్పగిరి పీఠాధిపతులు ప్రవచనాలు జరుపుతామని చెప్పారు. నాలుగు ఆగమాలకు సంబంధించిన యాగశాలల యందు మేము సంకల్పించిన దానికన్నా బుత్వికలందరూ కార్యక్రమాల సంఖ్య పెంచుతూ ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.