బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన తొలి హిందీ చిత్రం ‘దీవానా’ విడుదలై ఇవాళ్టితో 30 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ షారుక్ ఖాన్ తో తాను నిర్మిస్తున్న ‘పఠాన్’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. వెండితెర నటుడిగా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న షారుక్ ను అభినందిస్తూ, తమ ‘పఠాన్’ను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చే యేడాది జనవరి 25 ప్రపంచవ్యాప్తంగా…
దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. నాగచైతన్యతో విడాలకులు తీసుకున్న తర్వాత నటిగా మరింత బిజీ అయ్యారామె. ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి సామ్ నటించిన తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక గుణశేఖర్ ప్యాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసుంది. శివలెంకకృష్ణప్రసాద్ నిర్మిస్తున్న మరో ప్యాన్ ఇండియా సినిమా ‘యశోద’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అంతే కాదు ఫిలిప్ జాన్ దర్శకత్వంతో హాలీవుడ్…
కరోనా పుణ్యమా అని ఇండియాలో ఓటీటీ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత ఇండియా అతి పెద్ద ఓటీటీ మార్కెట్ గా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ పెంచాయి. కరోనాతో థియేట్రికల్ రంగం కుదేలయిపోయింది. ఇప్పటికీ పలు ఏరియాల్లో థియేటర్లు ఓపెన్ కాలేదు. ఎంటర్ టైన్ మెంట్ ని ఇష్టపడే భారతీయులు తమ దృష్టిని ఓటీటీవైపు మళ్ళించారు. పలు అంతర్జాతీయ డిజిటల్…
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ కు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో టైఅప్ అయింది. ఈ ఒప్పందంలో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న నాలుగు చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో మొదటిది నవంబర్ 19న విడుదల కాబోతున్న ‘బంటీ అవుర్ బబ్లీ -2’. అలానే అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘పృథ్వీరాజ్’తో పాటు ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘షంషేరా’ సినిమాలను…
మానుషీ చిల్లర్… మాజీ ప్రపంచ సుందరి! ఐశ్వర్య, ప్రియాంక తరువాత ఆ స్థాయిలో ప్రపంచాన్ని ఆకర్షించిన ఇండియన్ మిస్ వరల్డ్. అయితే, కిరీటం సాధించిన తరువాత తొందర పడకుండా కూల్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేరుగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తోనే మూడు చిత్రాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఫస్ట్ మూవీలోనే అక్షయ్ కుమార్ సరసన మహారాణి సంయోగితగా ఎంపికైంది. ‘పృథ్వీరాజ్’ చిత్రంతో మానుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చారిత్రక చిత్రం పూర్తికాగా,…
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్, యశ్ రాజ్ ఫిలిమ్స్ ఫస్ట్ కాంబినేషన్ లో దాదాపు 180 కోట్ల రూపాయలతో ఓ సూపర్ హీరో సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే ఇందులో హీరో అజయ్ దేవ్ గన్ కాదు, నూతన నటుడు ఆహాన్ పాండే! అజయ్ కేవలం విలన్ మాత్రమే. కానీ మూవీ సెట్స్ పైకి వెళ్ళక ముందే ఇప్పుడు అజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. శివ్ రావెల్ దర్శకత్వంలో యశ్…