మానుషీ చిల్లర్… మాజీ ప్రపంచ సుందరి! ఐశ్వర్య, ప్రియాంక తరువాత ఆ స్థాయిలో ప్రపంచాన్ని ఆకర్షించిన ఇండియన్ మిస్ వరల్డ్. అయితే, కిరీటం సాధించిన తరువాత తొందర పడకుండా కూల్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేరుగా యశ్ రాజ్ ఫిల్మ్స్ తోనే మూడు చిత్రాల అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఫస్ట్ మూవీలోనే అక్షయ్ కుమార్ సరసన మహారాణి సంయోగితగా ఎంపికైంది. ‘పృథ్వీరాజ్’ చిత్రంతో మానుషీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చారిత్రక చిత్రం పూర్తికాగా, కరోనా గందరగోళం ఏదీ మరోమారు ఎదురు కాకుంటే, 2021 చివరికల్లా జనం ముందుకు రావచ్చు…
ఆదిత్య చోప్రా లాంటి బడా నిర్మాత సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మానుషీ చిల్లర్ రెండో సినిమా కూడా ఆయనకే చేస్తోంది. విక్కీ కౌశళ్ హీరోగా ఓ కామెడీ ఎంటర్టైనర్ ప్లాన్ చేశాడు ఆది చోప్రా. ఆ సినిమాలోనూ యంగ్ హీరో విక్కీతో బ్యూటీ క్వీన్ రొమాన్స్ చేయనుంది. అయితే, లెటెస్ట్ టాక్ ప్రకారం, తమ త్రీ మూవీ అగ్రిమెంట్ లో భాగంగా మరో సినిమాను మిస్ మానుషీకి ఆఫర్ చేసిందట యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్.
బాలీవుడ్ కి పరిచయం అవుతోన్న మరో స్టార్ కిడ్ అహాన్ పాండే. వైఆర్ఎఫ్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా యంగ్ హీరోతో తొలి చిత్రం చేయనున్నాడు. శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందే ఆ సినిమాలోనూ మానుషీ కథానాయికగా కనిపించనుందట. అహాన్ పాండే బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకి తమ్ముడు. చంకీ పాండే సోదరుడు చిక్కీ పాండేకి అహాన్ కొడుకు. చూడాలి మరి, అక్షయ్ లాంటి సూపర్ సీనియర్ హీరోతో ఒకటి, విక్కీ కౌశల్ లాంటి సీనియర్ తో మరొకటి, అహాన్ పాండే లాంటి జూనియర్ తో మూడో చిత్రం చేస్తోన్న బ్యూటీ పేజెంట్ క్వీన్ మానుషీ, ప్రేక్షకుల ముందుకి, ఏ రేంజ్ లో దూసుకొస్తుందో!