ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ కు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో టైఅప్ అయింది. ఈ ఒప్పందంలో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న నాలుగు చిత్రాలను థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇందులో మొదటిది నవంబర్ 19న విడుదల కాబోతున్న ‘బంటీ అవుర్ బబ్లీ -2’. అలానే అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘పృథ్వీరాజ్’తో పాటు ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘షంషేరా’ సినిమాలను అమెజాన్ ప్రైమ్ ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి.