The Kashmir Files చిత్రంతో వార్తల్లో నిలిచిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రభుత్వం అత్యన్నత భద్రతను అందించడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన The Kashmir Files మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో కాశ్మీరీ పండిట్‌లపై 1990లో జరిగిన అఘాయిత్యాలను చూపించారు. తీవ్రవాదం ఉధృతంగా ఉన్న సమయంలో కాశ్మీర్ లోయ నుండి కాశ్మీరీ…