యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల లేజర్ షోతో రామప్ప వెలిగిపోతోంది.
హరిత కాకతీయలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు మాట్లాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి వల్ల వచ్చిందనీ చెప్పుకుంటున్నారని.. ఆయన చేసిందేమీ లేదని మంత్రులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల కృషి వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
ములుగు జిల్లా రామప్ప దేవాలయం వారసత్వ ఉత్సవాలకు సిద్ధం అయ్యింది. ‘శిల్పం వర్ణం కృష్ణం’ అనే పేరుతో ప్రపంచ వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడాని ప్రభుత్వం ఏర్పట్లను పూర్తి చేసింది.