ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. భూమి మానవులకే కాదు లక్షలాది జంతువులు, మొక్కలకు నిలయం.. కానీ మానవులు తమ అవసరాలను తీర్చుకోవడానికి భూమికి అనేక రకాల హాని కలిగిస్తున్నారు.
“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం” అన్నారు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రథసారథి జోగినిపల్లి సంతోష్ కుమార్. ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన ఆయన “ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ…