Mohammed Shami:వరల్డ్ కప్ టోర్నీలో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే టోర్నీలో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్నారు. టోర్నమెంట్‌లో ఆరు మ్యాచులు ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రస్తుతం షమీ వరల్డ్ కప్ తో భీకరమైన ఫామ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తప్పుకోవడంతో షమీకి ఛాన్స్…
చరిత్రలో గుర్తుండిపోయే విధంగా వరల్డ్కప్ ఫైనల్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా-ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ టైటిల్ పోరును చిరస్మరణీయంగా మలిచేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తోంది.
World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచు కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఆదివారం జరగబోయే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాకుండా, క్రికెట్ ఇష్టమున్న ప్రతీ ఒక్కరు ఈ హై ఓల్టెజ్ మ్యాచు కోసం చూస్తు్న్నారు. రోహిత్ సేన సగర్వంగా వరల్డ్ కప్ నెగ్గాలని సగటు ఇండియన్ అభిమాని కోరుకుంటుతోంది. ఈ మ్యాచు కోసం అతిథులు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియానికి హాజరుకాబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో…
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు మరొక రోజే సమయం ఉంది. ఈ మహాసంగ్రామం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ టోర్నీలో అన్నింటిలో అన్నీ మ్యాచ్లు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియాను ఒక సమస్య భయపెడుతుంది. అదేంటంటే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టైటిల్ మ్యాచ్‌లో, టీమిండియాకు అచ్చురాని అంపైర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే రిచర్డ్ కెటిల్‌బరో.. ఇప్పుడు ఈ అంఫైర్ టీమిండియాకు పెద్ద ముప్పులా మారే అవకాశం ఉంది.
వరల్డ్ కప్ 2023లో టీమిండియా విజయాల జోరును చూపించింది. ఆడిన అన్నీ మ్యాచ్ ల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. అయితే ఇప్పుడు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే టోర్నీ టైటిల్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు స్టేడియంకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ కోసం కొందరు అతిరథులు స్టేడియానికి రానున్నారు.
భారత క్రికెట్ జట్టులో షమీ తన సత్తాను నిరూపించుకుంటున్న సమయంలో.. అతని విడిపోయిన భార్య హసిన్ జహాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని జహాన్ తెలిపింది. అతను మంచి వ్యక్తి అయితే తన కూతురు, తన భర్త, తాను సంతోషకరమైన జీవితాన్ని గడిపేవాళ్లమని పేర్కొంది. అతను మంచి ఆటగాడు మాత్రమే కాకుండా.. మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అది మరింత గౌరవంగా ఉండేదని…
వరల్డ్ కప్ 2023 ఫైనల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఈ మెగా టోర్నీ చివరిపోరులో ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితం రావాలంటే ఒక్కరోజు వేచిచూస్తే సరిపోతుంది. ఈ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉండనుంది. కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం.. టీమిండియా ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభించి.. ఆ తర్వాత ఎదురుదెబ్బలను ఎదుర్కొంటుందని తెలుపుతున్నారు. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధించి సరికొత్త…
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ తలపడగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా పోరు జరుగనుంది.