చరిత్రలో గుర్తుండిపోయే విధంగా వరల్డ్కప్ ఫైనల్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా-ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ టైటిల్ పోరును చిరస్మరణీయంగా మలిచేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తోంది. అందుకోసం, ఫైనల్ మ్యాచ్ లో పలు ఈవెంట్లను ప్లాన్ చేశారు.
World Cup 2023: టీమిండియాకు అచ్చురాని అంఫైర్ మళ్లీ ఫైనల్లో..!
ముందుగా ఎయిర్ షో తో వరల్డ్ కప్ ఫైనల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. సూర్య కిరణ్ అక్రోబాటిక్ టీమ్ ఆధ్వర్యంలో 9 మంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో ఎయిర్ షో నిర్వహించనున్నారు. 10 నిమిషాల పాటు ఎయిర్ షో జరుగనుంది. ఈ వైమానిక విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి ఇన్నింగ్స్ పూర్తి అయిన తర్వాత… మరో అద్భుత ఘట్టం ఉండనుంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలిచిన వివిధ జట్ల సారథులను సత్కరించనున్నారు. 1975 వరల్డ్ కప్ ట్రోఫీ మొదలుకుని.. 2023 వరల్డ్ కప్ ట్రోఫీల డిస్ ప్లే చేయనున్నారు. 20 సెకండ్ల పాటు డిస్ ప్లే ఉంటుంది. అందుకోసమని.. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకు.. స్పెషల్ బ్లేజర్ ను అందించనుంది బీసీసీఐ.
Jay Shah: జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు.. ఆ విషయంలోనే..!
ఆ తర్వాత.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ షో ఉండనుంది. అందులో 500 మంది డ్యాన్సర్లతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా తెలుగు సింగర్ శ్రీరామ్ చంద్ర ప్రదర్శన ఉండనుంది. ఇక.. డ్యాన్స్ షో తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది. సెకండ్ ఇన్నింగ్స్ డ్రింక్ బ్రేక్ లో లేజర్ షో ఉండనుంది. మ్యాచ్ పూర్తి అయిన తర్వాత 1200 డ్రోన్లతో ఆకాశంలో విన్నింగ్ ట్రోఫీ, విన్నర్ టీమ్ ప్రదర్శన చూపించనున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఫైర్ వర్క్ కాంపిటిషన్ ఉండనుంది. విన్నర్ టీమ్ కి ట్రోఫీ అందించే వరకు ఆకాశమే హద్దుగా నాన్ స్టాప్ గా క్రాకర్స్ పేలనున్నాయి.