ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 273 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగాడు.
వరల్డ్‌కప్ 2023లో మహమ్మద్ షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ విషయమై టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. ఈరోజు జరిగే గ్రూప్ దశ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఇండియా ఓటమి పాలైనా తాను పెద్దగా పరిగణనలోకి తీసుకోబోనని రవిశాస్త్రి పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సూచనను ఈ సందర్భంగా శాస్త్రి గుర్తు చేశారు.
India opt to bowl in IND vs NZ Match: ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, మొహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు కివీస్ విన్నింగ్ కాంబోతోనే ఆడుతోంది.…
Rohit Sharma and Virat Kohli interview Ahead of IND vs NZ Match: తప్పకుండా ఈసారి న్యూజిలాండ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని.. వ్యక్తిగతంగానూ, జట్టు పరంగానూ ఏం చేయాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చామని భారత సారథి రోహిత్ శర్మ తెలిపాడు. న్యూజిలాండ్ వ్యూహాలను అమలు చేయడంలో దిట్టని అభిప్రాయపడ్డాడు. నిలకడైన ఆటతీరును ప్రదర్శించడం వల్లే కివీస్ సక్సెస్ అవుతోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో నేడు…
Suryakumar Yadav To Play IND vs NZ Match in Hardik Pandya’s Absence: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా సాగుతున్న భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ప్రపంచంలోని అందమైన క్రికెట్ వేదికల్లో ఒకటైన ధర్మశాలలో ఈ మెగా సమరం జరుగనుంది. ఐదవ విజయంపై ఇరు జట్లు కన్నేశాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాలి…
India vs New Zealand 21st Match Prediction: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు మెగా సమరం జరగనుంది. మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవడమే కాదు.. ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇరు జట్లు సమవుజ్జీల్లా ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లలో ఐదవ విజయం ఎవరిదో?.. తొలి ఓటమిని రుచి చూసేదెవరు? అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధర్మశాలలో…
టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ప్రపంచకప్-2023లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆలౌరౌండర్ రవీంద్ర జడేజా గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అతని మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఎట్టకేలకు తన ఖాతా ఓపెన్ చేసింది. లక్నోలో నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్లో నెదర్లాండ్ జట్టు గెలవడం కంటే మంచి ప్రదర్శన చూపించారు.