How Can Pakistan Qualify For World Cup 2023 Semi Final: ఒక్క మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తలరాతే మారిపోయింది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన ఆసీస్.. వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఆపై వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగో స్థానానికి చేరుకున్నా.. మైనస్ నెట్ రన్ రేట్ కారణంగా సెమీస్ అవకాశాలు కష్టంగానే మారాయి. అయితే బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌ను ఏకంగా 309 పరుగుల తేడాతో…
BCCI releases tickets for India vs Sri Lanka: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 10 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత శ్రీలంకతో భారత్…
Glenn Maxwell Fumes At World Cup 2023 Light Show: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నిర్వహిస్తోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఫైర్ అయ్యాడు. ప్రపంచకప్ మ్యాచ్ మధ్యలో నైట్ క్లబ్ స్టైల్ లైట్ షోస్ ఏర్పాటు చేయడం సరికాదని, లైట్ షో వల్ల తనకు భయంకరమైన తలనొప్పి వచ్చిందన్నాడు. లైట్ షో అభిమానులకు అద్భుతమైన అనుభూతినిస్తుందేమో కానీ.. క్రికెటర్లకు మాత్రం భయానక అనుభవమే అని మ్యాక్సీ…
England vs Sri Lanka Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచులలో ఒక విజయం సాధించిన శ్రీలంక, ఇంగ్లండ్ జట్లకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి అన్ని గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా…
Glenn Maxwell smashes Fastest ODI World Cup Century: ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ శతకం బాదాడు. మ్యాక్సీ ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు, 9 ఫోర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ 106 పరుగులు చేశాడు.…
నెదర్లాండ్స్ 9 పరుగులకే ఆఖరి 5 వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 310 పరుగుల భారీ తేడాతో కొత్త ప్రపంచకప్ రికార్డును నెలకొల్పింది.
2023 ప్రపంచకప్‌లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆసీస్ విధ్వంసం సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికా మరో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏకపక్ష మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై సునాయాస విజయాన్ని సాధించింది.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన డికాక్.. తాజా మరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు.