అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ - ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు.. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్‌లు.
World Bank Warning : భారతదేశ నగరాల్లో వాతావరణ మార్పులు భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపవచ్చని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 70% కొత్త ఉద్యోగాలు నగరాల్లోనే ఏర్పడతాయని అంచనా. అయితే వరదలు, ఉష్ణ తరంగాలు (హీట్‌వేవ్స్), అనూహ్య వర్షాలు వంటి క్లైమేట్ రిస్క్స్ కారణంగా సుమారు $5 బిలియన్ (దాదాపు ₹40,000 కోట్లు) నష్టం జరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుత వేగంతో వాతావరణ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.
Indus Water Treaty: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ తరుణంలోనే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా భారతదేశానికి వచ్చారు. గురువారం ఆయన ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉత్తర్ ప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే, భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు ‘‘వరల్డ్ బ్యాంక్’’ దూరంగా ఉంది. ‘‘ప్రపంచ బ్యాంక్‌కి సహాయకుడి పాత్రకు మించి ఎలాంటి పాత్ర లేదు’’ అని అజయ్ బంగా చెప్పారు.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్న చందంగా మారింది. భారత్‌తో పెట్టుకున్న కయ్యం ఆ దేశానికి పెను శాపంగా పరిణమించింది. ఆర్థికంగా దివాళా తీసిన పాక్, ఇప్పుడు నిధుల కోసం ప్రపంచ దేశాల ముందు ఆర్తనాదాలు చేస్తోంది. తొందరపాటుతో యుద్ధానికి దిగిన పాక్, భారత దాడులతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. తమ దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ భాగస్వాములను, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకును…
Ajay Banga: పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల మధ్య ‘‘ప్రపంచ బ్యాంక్’’ అధ్యక్షుడు అజయ్ బంగా గురువారం ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. పాకిస్తాన్, పీఓకేలలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసిన ఒక రోజు తర్వాత ఆయన మోడీని కలిశారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది.
India Pakistan Tension: పాకిస్తాన్‌కి భారత్ దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది. ఈ వేసవిలో పాకిస్తాన్ గొంతెడటం ఖాయంగా కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పాకిస్తాన్ పాత్ర స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. పాక్‌కి చెందిన లష్కరేతోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి.
మహారాష్ట్రలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు, ప్రత్యేకంగా మరింత వెనుకబడిన జిల్లాలపై దృష్టి సారించేందుకు గానూ ప్రపంచ బ్యాంక్ 188.26 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది. ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం జిల్లాల్లో 188.28 మిలియన్ డాలర్లు మహారాష్ట్ర పటిష్ట సంస్థాగత సామర్థ్యాలు, జిల్లాల ప్రణాళిక, వృద్ధి వ్యూహాలకు మద్దతు ఇస్తాయని ప్రపంచ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని “అమరావతి” అభివృద్ధికి ఈ ఏడాది చివరకల్లా రూ. 15 వేల కోట్లు రుణం ఇవ్వనున్నారు.. “ప్రపంచ బ్యాంకు”, “ఏసియా డెవలప్ మెంట్ బ్యాంకు” (ఏడీబీ)లు సంయుక్తంగా రూ. 15 వేల కోట్లు రుణం అందించనున్నాయి.. “అమరావతి” అభివృద్ధికి రుణ మంజూరుపై ఈ రోజు ఢిల్లీలో రెండు బ్యాంకుల ఉన్నతాధికారులతో ఏపీ ఉన్నతాధికారుల చర్చలు సుదీర్ఘంగా సాగాయి..
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టు అయ్యింది.. అమరావతి నిధుల ప్రతిపాదనపై ప్రంపచబ్యాంకు, ఏడీబీ, హడ్కో రుణాలపై ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.. ప్రపంచ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో బ్యాంకు అధికారులు పాల్గొన్నారు..