ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పెంచేందుకు ప్రపంచ బ్యాంకు పెద్ద అడుగు వేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలల కోసం 300 మిలియన్ డాలర్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఈరోజు ఆమోదించింది.
ఈ ప్రపంచంలోనే దాదాపు 230 కోట్ల మంది వంట చెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని ఈ ఐదు సంస్థలు వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని తెలియజేశాయి.
IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.
World Bank lowers India's FY24 growth forecast to 6.3%: ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్య పరిస్థితుతలతో సతమతం అవుతోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వృద్ధి దారుణంగా ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. వీటన్నింటి ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 4-5 శాతం మధ్య ఉంటుందని చెబుతున్నాయి. మరోవైపు మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో తప్పకుండా ఆర్థిక…
కొన్నేళ్లగా భారతీయులు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారు. ప్రపంచదేశాల్లో నాయకులుగా, సారథులుగా ఎదుగుతున్నారు. భారత సంతతికే చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్.. గూగుల్, దాని మాతృసంస్థ అల్పాబెట్ సీఈఓగా ఉన్నారు.
భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ అయిన భారతీయ అమెరికన్ అజయ్ బంగాకు ఢిల్లీ వచ్చిన తర్వాత కొవిడ్ పాజిటివ్ అని తేలింది. మూడు వారాల ప్రపంచ పర్యటనలో భాగంగా మార్చి 23న అజయ్ బంగా ఢిల్లీకి చేరుకున్నారు.
టర్కీలో ఫిబ్రవరి 6వ తేదీన 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రకృతి బీభత్సానికి దాదాపు 50 వేల మంది ప్రాణాలుకోల్పోయారు. టర్కీ భూకంప నష్టం సుమారు 100 బిలియన్ల డాలర్లకు మించి ఉంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మాల్పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత, ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించేందుకు మాజీ మాస్టర్‌కార్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను వాషింగ్టన్ నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం తెలిపారు.