World Bank Warning : భారతదేశ నగరాల్లో వాతావరణ మార్పులు భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపవచ్చని ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదిక హెచ్చరిస్తోంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 70% కొత్త ఉద్యోగాలు నగరాల్లోనే ఏర్పడతాయని అంచనా. అయితే వరదలు, ఉష్ణ తరంగాలు (హీట్‌వేవ్స్), అనూహ్య వర్షాలు వంటి క్లైమేట్ రిస్క్స్ కారణంగా సుమారు $5 బిలియన్ (దాదాపు ₹40,000 కోట్లు) నష్టం జరిగే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది.
ప్రస్తుత వేగంతో వాతావరణ మార్పులు కొనసాగితే, నగరాలు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఉన్న నగరాలు, తీరప్రాంతాలు, , వేగంగా పెరుగుతున్న పట్టణాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి నేరుగా ఉద్యోగాలు, మౌలిక వసతులు, ఆర్థిక వ్యవస్థపై దెబ్బతీస్తాయి.
Rare Earth Elements: దేశంలో 8.52 మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’.. చైనా ఆధిపత్యానికి చెక్..
ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం, 2050 వరకు క్లైమేట్ రిస్క్స్‌ను ఎదుర్కొనేందుకు $2.4 ట్రిలియన్ (దాదాపు ₹2 లక్షల కోట్లు) పెట్టుబడులు అవసరం. అదే విధంగా, 2070 నాటికి ఈ ఖర్చులు $10 ట్రిలియన్ దాటవచ్చని నివేదికలో స్పష్టం చేసింది. గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, , తగిన సాంకేతిక పరిష్కారాల్లో భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది.
నగరాలు భవిష్యత్తులో కొత్త ఉద్యోగాల ప్రధాన కేంద్రాలు అవుతాయని అంచనా ఉన్నప్పటికీ, అదే సమయంలో ఈ ఉద్యోగాలు వాతావరణ విపత్తుల కారణంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరిస్తోంది. గ్రీన్ బిల్డింగ్, పునరుత్పాదక ఇంధన రంగాలు, వనరుల సమర్థ వినియోగం వంటి రంగాల్లో మిలియన్లకొద్దీ కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని నివేదిక చెబుతోంది.
క్లైమేట్ రిస్క్స్‌ను తగ్గించేందుకు స్థానిక సంస్థలకు అధికారం, నిధులు, , సాంకేతిక సహాయం అవసరం. నగర పాలక సంస్థలు విపత్తు నిర్వహణ ప్రణాళికలు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలు, చెట్ల పెంపకం, , సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి.
భారత నగరాలు భవిష్యత్తులో ఉద్యోగాల కేంద్రంగా ఎదుగుతూనే, వాతావరణ విపత్తుల వల్ల ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉందని ప్రపంచ బ్యాంక్ స్పష్టంచేసింది. దీనికి ముందస్తు చర్యలు తీసుకుని, క్లైమేట్ ప్రూఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.
Bengaluru: బెంగళూర్ బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ స్వాధీనం..