ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల జూలై 7, 8 తేదీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు. కాగా.. ఈ క్రమంలో తెలంగాణలో జూలై 8న రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
డిజిటల్ చెల్లింపులలో అత్యంత ఇంపార్టెంట్ క్యూఆర్ కోడ్ మాత్రమే. దీని సహాయంతో ఎవరికైనా నగదును ఈజీగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం వల్ల ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు.
తెలంగాణ సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు.
రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి.. అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాలమూరు స్టేడియం గ్రౌండ్ లో 40 లక్షల అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో నారాయణపేట అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వక్తం చేశారు. తెలంగాణ వచ్చాక పూర్వ వైభవం తెస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంగా మార్చామని గుర్తు చేశారు. తెలంగాణాలో ఏ అభివృద్ధి పని…