ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు కాలం కంటే వేగంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇల్లు, పిల్లలు, ఉద్యోగం, ఆఫీసు, ఆసుపత్రులు ఇలా ఒకటేమిటి వివిధ రకాల బాధ్యతలతో ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ఈ ప్రభావం చేసే పనిపై ఎక్కువగా పడుతూ.. మానసిక ఆందోళనకు కారణమవుతోంది. కొన్ని సార్లు ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోవడం, అనుకున్నది పూర్తి చేయలేకపోవడం లాంటి సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫలితంగా ఆందోళన ఇంకా ఎక్కువవుతోంది.
Sleep Crisis: భారతీయులు సరిగా ‘నిద్ర’’పోవడం లేదు. ‘‘నిద్ర సంక్షోభం’’ ముంచుకొస్తుందని గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 13 మార్కెట్లలో 30,026 మందిపై అధ్యయనం నిర్వహించింది. భారతీయులు ప్రతీ వారంలో మూడు రోజులు నిద్రను కోల్పోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నప్పటికీ, ఎలాంటి వైద్య సహాయం తీసుకోకపోవడం గమనార్హం. నిద్రలేమితో అలసట, ఒత్తిడిలో చిక్కుకుంటున్నారు