ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో శ్రీలంక, భారత్ జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. రెండు జట్లూ తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. నేడు శ్రీలంకలోని దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టు, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.