Witchcraft: ఒడిశా గజపతి జిల్లాలో క్షుద్ర విద్య, చేతబడి చేస్తు్న్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. 35 ఏళ్ల వ్యక్తిని చంపి, అతడి ప్రైవేట్ భాగాలు ముక్కలు చేసి, సమీపంలోని హరభంగి డ్యామ్‌లో పారేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు వ్యక్తి గొంతు కోసం చంపిన తర్వాత, అతడి జననేంద్రియాలు కత్తిరించి, మృతదేహాన్ని జలాశయంలో పారేశారు. పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు.
గణపతి నవరాత్రోత్సవాల వేళ భక్తులు గణేశుడి నామస్మరణలో మునిగిపోయి ఉంటే.. మరో వైపు క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుందూ నది సమీపంలో ముళ్ల పొదల్లో ముగ్గు వేసి నల్ల కోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించాయి.
Horrifying incident: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి పేరుతో ఐదుగురిని అత్యంత కిరాకతంగా హతమార్చారు. జిల్లాలోని కుంటలోని కోయిలిబెడ ప్రాంతంలోని ఎత్కల్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టిచంపారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో మూఢనమ్మకాల వల్ల హింస చెలరేగుతోంది.
మంత్రాలు చేస్తోందన్న అనుమానంతో ఓ మహిళపై క్రూరత్వం చూపించారు. కనికరం లేకుండా.. దాడి చేశారు. ఈ ఉదంతం ఉత్తర ప్రదేశ్లోని సూరజ్‌పూర్ ఖేడీ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే.. తమ కూతురు అనారోగ్యానికి కారణం ఆ మహిళేనని.. తాను చేతబడి చేస్తుందని అనుమానించారు. దీంతో.. బాలిక కుటుంబీకులు ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. అంతే కాకుండా జుట్టు కూడా కత్తిరించారు.
Witchcraft: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నారన్న నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో గాయాల పాలైన వారిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు.
Menstrual Blood : ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన. మహారాష్ట్రలో ఈ దారుణం వెలుగు చూసింది. అఘోరీ విద్య కోసం అత్త సొంత కోడలు రుతుక్రమ రక్తాన్ని అమ్మేసినట్లు తెలిసింది.
సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూసినప్పుడు మనం ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నాం అనిపించకమానదు. ఆ ఘటనలు విన్నప్పుడు కడుపు రగిలిపోతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఒక ఘటనే పెద్దిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. కన్నబిడ్డలపై ఒక తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ప్రపంచం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంటే.. ఈ రాక్షసుడు మాత్రం క్షుద్ర పూజల పేరుతో చిన్నారిని బలితీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణు కుటుంబంతో సహా కలిసి నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో నివాసముంటున్నాడు. అతనికి…