అతడో ఆర్మీ జవాన్.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి.. విధులు పూర్తిచేసుకొని ఏడాదికి ఒకసారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో సరదాగా గడపకుండా దారుణానికి ఒడిగట్టాడు. నిత్యం మద్యం సేవిస్తూ భార్యాపిల్లలను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలకు మంచి బుద్దులు నేర్పించాల్సిన వాడే, వారిముందు భార్యను బెల్టుతో చితకబాదాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య అందరు నిద్రపోతుండగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని పిల్లలను అనాధలుగా వదిలేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్…
అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అమెజాన్‌లో ఓ వస్తువును కొనుగోలు చేసింది. అమెజాన్‌లో కొనుగోలు చేసిన వస్తువును డోర్ డెలివరీ చేసేందుకు డెలివరీ విమెన్ ఇంటికి వచ్చింది. ఈ లోగా కస్టమర్ నుంచి ఆమెకు ఓ మెసేజ్ వచ్చింది. భర్తకు తెలియకుండా ప్యాకేజీని దాచిపెట్టాలని మెసేజ్ వచ్చింది. మొదట ఇంటి గుమ్మం ముందు పార్శిల్‌ను ఉంచింది. ఆ తరువాత అక్కడి నుంచి తీసి దానిని ఇంటి బయట ఉన్న చెట్టుపొదల్లో దాచింది. దానిని ఫొటోగా…
ఎన్ని చదువులు చదువుకొని ఏమి ప్రయోజనం సంస్కారం లేకపోతే.. ఇంకా సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పోలేదని కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న భర్తలకు కొదువే లేదు. తాజాగా ఒక ప్రబుద్దుడు కూడా వరుసగా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యను పుట్టింటికి పంపి, వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య, భర్త ఇంటిముందు ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని…
కరోనా సమయంలో ప్రపంచంలో సింహభాగం ప్రజలు ఇంటివద్ధనే ఉండిపోయారు. కరోనా నుంచి కోలుకున్నాక ఫ్యామిలీ కోర్టుల్లో కేసులు పెరిగిపోయాయి. విడిపోయే జంటలు పెరిగాయి. కరోనా మహమ్మారి ఇటలీని ఎంతగా కుదిపేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. చైనా తరువాత కేసులు నమోదైంది ఇటలీలోనే. ఇటలీలో పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్న సమయంలో జైల్లో వివిధ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నవారిని ఇంటికి పంపేశారు. ఇళ్లలోనే జైలు జీవితం గడిపేలా ఏర్పాట్లు చేశారు. అయితే, గైడోనియా మౌంటేసిలియోలోకి చెందిన వ్యక్తి…
భార్యపై ఆయనకు అమితమైన ప్రేమ ఉన్నది. అయితే, తన జీవితంలో ఎక్కువ సమయం సంపాదించేందుకు కష్టపడ్డాడు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసి పిల్లలకు అందించాడు. పిల్లలు ప్రస్తుతం వ్యాపారం చూసుకుంటుండగా, 72 ఏళ్ల పెద్దాయన తన భార్యకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. అందిరిలా కాకుండా ఆ వయసులో కూడా ఢిఫరెంట్‌గా ఆలోచించి ఓ ఇంటిని నిర్మించాడు. ఆ ఇల్లు గోడలు ఆకుపచ్చని రింగులోనూ, పైకప్పు ఎరుపు రంగులో ఉండేలా తీర్చిదిద్దాడు. అయితే, అన్ని ఇళ్ల కంటే ఈ…
పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. మృతురాలు భర్త సూరజ్‌కు రెండు జీవిత ఖైదులను విధించింది.. తన భార్యను హత్య చేసిన కేసులో భర్త సూరజ్‌ను గత సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు.. ఈ నేరానికి దోషికి మరణశిక్ష విధించాలి..…
బతికి ఉన్నప్పుడు ఏ భర్తయినా..భార్యను ప్రేమిస్తాడు. ఐతే..చనిపోయిన తర్వాత కొంతమంది భర్తలు మాత్రమే భార్య జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే చంద్రగౌడ్. ఇంతకీ..ఆయన మరణించిన తన భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా?సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లికి చెందిన చంద్రగౌడ్, రాజమణి భార్య భర్తలు. చంద్రగౌడ్ వృత్తిరీత్యా నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పని చేసి రిటైర్ అయ్యాడు. వీరికి ఇద్దరు కొడుకులు..ఒక కూతురు. చంద్రగౌడ్కు భార్య అంటే ఎంతో ప్రేమ. ఆమెను కంటికి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.. ఇక, ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది.. తాజాగా, శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుటుంబం కరోనా బారినపడింది… మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ , ఆయన సతీమణి , కుమార్తె టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త గౌతు శిరీషకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. ప్రస్తుతం వైజాగ్ లోని…
అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడు తో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. బషీరాబాద్ లో ఈ నెల 17 వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును చెందించారు పోలీసులు. మృతుడు హనుమంతు హత్యకు కారణమైన భార్య అంబిక , రేవన్ సిద్ధప్ప లను అరెస్ట్ చేసారు. అరెస్ట్ ఐన ఇద్దరు కర్ణాటక రాష్ట్రం ఎలాక్ పల్లి గ్రామనికి చెందినవారు. హత్య గావించబడిన హనుమంతు ఎనిమిది సంవత్సరాల క్రితం పక్షపాతంతో ఒక చెయ్యి, ఒక…
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలని కత్తితో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకొంది. రజాక్ అనే వ్యక్తికి అనంతపురం పట్టణానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా రజాక్ భార్య షర్మిలపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పరాయి పురుషులతో మాట్లాడడం సహించలేకపోయాడు. తరచూ ఆమెతో గొడవ పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపంలో కత్తితో ఆమెపై దాడికి…