చైనాలోని ఊహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ అయిందని ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. అమెరికాతో సహా అనేక దేశాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచే లీకయిందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాలో గతంలో పర్యటించిన తరువాత ల్యాబ్ నుంచి వచ్చిందా లేదా అన్నదానిపై మరింత విపులంగా పరిశోధించాలని పేర్కొన్నది. ల్యాబ్ నుంచి లీకైందని కొట్టిపారెయ్యలేమని చెప్పింది. మరోసారి చైనాలో పర్యటించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ…
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్‌వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే,…
ప్రపంచంలో కరోనా ఉదృతి ఏమాత్రం తగ్గడంలేదు. కొన్ని దేశాల్లో తగ్గినట్టు కనిపించినా తిరిగి కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త రకాల వేరియంట్లు పుట్టుకురావడంతో కరోనా మహమ్మారి కట్టడి సాధ్యం కావడంలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది. ఏ దేశంలోనూ కరోనా ముగింపుకు రాలేదని, కొత్త వేరియంట్లు ప్రమాదకరమైన వేరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. బ్రిటన్‌లో జరిగిన యూరోకప్, దక్షిణ అమెరికాలో జరిగిన కొపా అమెరికా కప్ కారణంగా ఆయా దేశాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని,…
కరోనా థర్డ్ వేవ్‌పై మరోసారి హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. ఓవైపు సెకండ్ వేవ్.. మరోవైపు డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరింయట్ ఇలా.. కొత్త వేరియంట్లు వెలుగుచూస్తోన్న తరుణంలో.. ప్రపంచవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ అప్పుడే మొదలైపోయిందని.. ఇప్పుడు థర్డ్ వేవ్ తొలి దశలో ఉందని వార్నింగ్ ఇచ్చారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్… మీడియాతో మాట్లాడిన ఆయన.. దురదృష్టవశాత్తు మనం కరోనా థర్డ్ వేవ్ ఆరంభ దశలో ఉన్నామని.. మహమ్మారి నిరంతరం…
కరోనా ఫస్ట్ వేవ్ కలవరపెడితే.. సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలు తీసింది.. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైపోయింది.. భారత్‌లోనూ వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. ఇంకా, సెకండ్ వేవ్ ముప్పు పోలేదని ఇప్పటికే భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, తాజా పరిస్థితిలపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అంటోంది..…
కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ప్రపంచ ఆరోగ్యసంస్థ సంతృప్తి వ్యక్తం చేసింది.త్వరలోనే ఎమర్జెన్సీ వినియోగానికి సంబంధించి అనుమతులు మంజూరు చేయనుంది. మరోవైపు.. భారత్ తన జనాబాలో 60 నుంచి 70శాతానికి వ్యాక్సీన్ వేయడం అత్యవసరమని who స్పష్టం చేసింది. హైదరాబాద్ బేస్డ్ వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్‌కు .. ప్రపంచ ఆరోగ్యసంస్థ శుభవార్త అందించింది. ఇప్పటికీ WHO అనుమతుల కోసం వేచి చూస్తున్న కోవాగ్జిన్‌కు.. త్వరలోనే అత్యవసర వినియోగానికి సంబంధించి, అనుమతులు మంజూరు చేయనుంది. read also :…
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ కొన్ని దేశాలను ఇప్పటికే టచ్ చేయగా.. రోజుకో వేరియంట్ తరహాలో కోవిడ్ కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే.. తాజా పరిస్థితులపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్.. కరోనా మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని హెచ్చరించారు.. కరోనా డెల్టా లాంటి వేరియంట్లు కాలక్రమేణా నిరంతరం మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన..…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరిగితేనే కరోనాకు చెక్ పడుతుంది. ధనిక దేశాల్లో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతున్నా, అఫ్రికాలోని అనేక దేశాల్లో వ్యాక్సిన్ అందని పరిస్థితి. పేద దేశాలకు వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు ధనిక దేశాలు, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశాలు తమవంతుగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. Read: వై. యస్. జగన్…
కరోనా మహమ్మారిలో అనేక వేరియంట్లు యావత్ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ఆల్ఫా వేరియంట్ అత్యధికంగా 172 దేశాల్లో వ్యాపించగా, దాని తరువాత డెల్టా వేరియంట్ 100కు పైగా దేశాల్లో వ్యాప్తిచెందినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టంచేసింది. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ కారణంగా ఎక్కువ కేసులు, మరణాలు సంభవించాయని, ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళన కలిగిస్తోందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొన్నది. రాబోయో రోజుల్లో ఈ వేరియంట్ మిగతా వేరియంట్లను డామినేట్ చేసే అవకాశం…