ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఖానాపూర్ సోషల్ మీడియా గ్రూప్‌లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తన రోజు వారి కార్యక్రమాలు, టూర్ షెడ్యూల్, హజరైన కార్యక్రమాల ఫోటోలు పెడుతున్నారు. అదే గ్రూప్‌లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కార్యక్రమాలు సైతం పోస్ట్ చేస్తున్నారు. అయితే రాథోడ్ జనార్దన్ వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారని ప్రచారం ఉండటంతో వర్గపోరుకు తెరతీసింది. దాంతో…