ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో సైబర్ నేరస్థులు కొత్త రకం మోసానికి తెరలేపారు. వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డ్ రూపంలో APK ఫైల్‌ను పంపారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, 100 మందికి పైగా మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయి. అందులో ఒక బాధితుడి ఖాతా నుంచి రూ. 2,700 కాజేశారు. ఈ వ్యవహారంపై మహిళా రైతు సెల్ జిల్లా అధ్యక్షురాలు ఉప్మా చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు తెలిపారు. Also Read:Job…
కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ పేరుతో సైబర్ మోసం చేసే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు.. 88819 42520 నెంబర్ కి కలెక్టర్ ఫొటోను డీపీగా పెట్టిన కేటుగాళ్లు.. కాకినాడ జిల్లా పరిధిలోని కొందరు ఎమ్మార్వోలకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు.. తాను అత్యవసర మీటింగ్ లో ఉన్నానని.. డబ్బులు తిరిగి రెండు రోజుల్లో రిటర్న్ చేస్తానని మెసేజ్‌లు పెట్టిన కేటుగాళ్లు.
వికసిత్ భారత్ వాట్సాప్ సందేశాలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళింపించింది. తక్షణమే సందేశాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
సోషల్ మీడియాలో రోజురోజుకీ కేటుగాళ్లు పెరిగిపోతున్నారు.. ఫేస్‌బుక్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో ఫేక్ ఐడీలు సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు.. తను కష్టాల్లో ఉన్నాను.. ఆర్థిక సాయం చేయండి అంటూ మెసేజ్‌లు పెట్టి.. తప్పుడు నెంబర్లతో గుల్ల చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అలా డబ్బులు ఇచ్చి ఎంతో మందా మోసపోయారు.. అయితే, ప్రముఖులను సైతం వదలడంలేదు కేటుగాళ్లు.. ఏకంగా భారత ఉపరాష్ట్రపతి పేరుతో ఫేక్ మేసేజ్‌లు పెడుతున్నారు.. Read Also: Ramzan…
వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత .. వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వివాదాస్పద పోస్టులు, పోటాపోటీ పోస్టులు.. ఇలా అనేక వివాదాలకు దారితీసిన సందర్భాలున్నాయి.. చిన్ని పంచాయితీలు వాట్సాప్‌కు ఎక్కి.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరిన సందర్భాలు కూడా లేకపోలేదు.. అయితే, ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపైనే అంతా భారం మోపడం ప్రారంభమైంది.. గ్రూపులో ఏం జరిగినా.. దానికి బాధ్యత వహించాల్సింది మాత్రం అడ్మినేలా తయారైంది పరిస్థితింది.. అయితే, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు ఊరట కల్పించేలా…
సోషల్ మీడియా బాగా విస్తరించింది. అపరిచిత వ్యక్తులు ఏవో మెసేజ్‌లు పంపుతూ వుంటారు. వాటికి స్పందించారంటే అంతే సంగతులు. మిమ్మల్ని చాలా తెలివిగా బుట్టలో వేసుకుంటారు దుండగులు. అనవసరమైన మెసేజ్‌లకు రిప్లై ఇస్తే, జేబులకు చిల్లుపడడం ఖాయం. హైదరాబాద్‌లో అనేక మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది కిలాడీ గ్యాంగ్. సెల్‌ఫోన్‌కు అవసరమైన మెసేజ్‌లతో పాటు అనవసరమైన మెసేజ్‌లు వస్తుంటాయి. ఒక నెంబర్ పంపించి… మీతో స్నేహం చేయాలని ఉందనో, లేక మీకు ఫోటోలు పంపించాం…
తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్‌లోనైనా వాట్సాప్ ఉండాల్సిందేనన్న రేంజ్‌కి వెళ్లిపోయింది.. దాని వెనుక ఆ సంస్థ కృషి కూడా ఎంతో ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో.. తమ యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది వాట్సాప్.. ఇప్పుడు తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో చెబుతోంది. వాట్సప్‌లో చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవకాశం ఉన్నా.. ఇప్పటికీ ఎక్కువ మంది మెసేజ్‌లు పంపించుకోవడానికే ఉపయోగిస్తారు. మెసేజ్ పంపించాలంటే..…