రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ 49వ రోజుకు చేరింది. నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు ములాఖత్ కానున్నారు. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన బాబు అరెస్టయిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు ఉంది.
నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి 3వ రోజు పర్యటన కొనసాగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మరణించిన వారి కుటుంబాలకు భువనేశ్వరి గారు పరామర్శించనున్నారు. రేణిగుంట సమీపంలోని ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం కుటుంబ సభ్యుల భువనేశ్వరి పరామర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో పాత ఆర్టీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ‘నిజం గెలవాలి’ సభలో ఆమె మాట్లాడుతారు.
నేడు తిరుపతిలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. ఉదయం 9 గంటలకు బాలాజీ కాలానికి పూలే విగ్రహం పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటలకు గ్రూప్స్ సినిమా హాల్ సమీపంలో బహిరంగ సభ ఉంటుంది. ఈ యాత్రను ఎంపీ విజయసాయి రెడ్డి ప్రారంభించనున్నారు.
నేడు సిరిసిల్లలో బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో “యువ ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.
నేడు మహబూబాబాద్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. కేసీఆర్ సమక్షంలో బీఅర్ఎస్ లో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మహబూబాబాద్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పాలేరు నుంచి మహబూబాబాద్ వస్తారు.
నేడు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు మహబూబాబాద్ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ చేరుకుంటారు.
నేడు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.