* ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023: నేడు భారత్‌తో తలపడనున్న శ్రీలంక.. మధ్యాహ్నం 2 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్
* ఇవాళ నిర్మల్, బాల్కొండ , ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం
* నేడు మేడిగడ్డలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పర్యటన.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించనున్న నేతలు
* బీజేపీ తెలంగాణ అభ్యర్థుల మూడో జాబితా ఫైనల్ చేసిన సీఈసీ.. దాదాపు బీజేపీ పోటీ చేసే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసిన సీఈసీ.. ఈ రోజు తెలంగాణ జాబితాను ప్రకటించనున్న బీజేపీ.
* ఢిల్లీ: ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి… రాహుల్ గాంధీ సమక్షంలో నిన్నే కాంగ్రెస్‌లో చేరిన వివేక్
* హైదరాబాద్: నేడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు సీపీఎం ప్రెస్ మీట్.. సీఎల్పీ నేత భట్టి మరోసారి ఫోన్ లో సంప్రదించారు.. ఇవాళ్టి వరకు వేచి ఉండాలని కోరారు.. ఈ రోజు 3 గంటల వరకు పొత్తుపై ఎటూ తేల్చకపోతే నేడే సీపీఎం అభ్యర్థులను ప్రకటిస్తాం.. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకున్నా సీపీఎం, సీపీఐ కలిసే ముందుకు..
* తిరుమల: ఈ రోజు డయల్ యూవర్ ఈవో కార్యక్రమం
* శ్రీకాకుళం: మందసలో సీపీఎం ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర.. మందస హైస్కూల్ నుండి కోట వరకు ప్రదర్శన, బహిరంగ సభ. బస్సు యాత్రను ప్రారంభించనున్న సీపీఎం పార్టీ అఖిల భారత నాయకులు విజూ కృష్ణన్ .
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మేకపాటి గౌతంరెడ్డి విగ్రహావిష్కరణ.. అనంతరం పొదలకూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల లో ఎం.ఎల్.ఏ విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా
* నెల్లూరు: కావలిలో జరగనున్న వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నేతల సమావేశం
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేటి నుంచి కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.. ఈనెల 10వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలు.. భారీగా ఏర్పాట్లు
* అనంతపురం : ప్రజాసమస్యల ప్తె సీపీఎం ఆధ్వర్యంలో బస్సుయాత్ర. ఇవాళ గుత్తి నుంచి అనంతపురం చేరుకోనున్న యాత్ర.
* నేడు విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభోత్సవ వేడుకకు హాజరుకానున్న సీఎం.. 57 ఏళ్ల తర్వాత ఐసీఐడీ సదస్సుకు అతిథ్యం ఇస్తున్న భారత్.. 74 దేశాల నుంచి హాజరుకానున్న 1200 మంది ప్రతినిధులు.. 1100 మందితో పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు.
* అమరావతి: నేడు వైసీపీ సామాజిక సాధికార యాత్ర డే- 5.. సామాజిక సాధికార యాత్ర జరిగే నియోజకవర్గాలు.. మాడుగుల – అనకాపల్లి జిల్లా.. అవనిగడ్డ – కృష్ణా జిల్లా.. చిత్తూరు – చిత్తూరు జిల్లా
* చిత్తూరు లో సామాజిక సాధికారత బస్సు యాత్ర.. చిత్తూరు కట్టమంచి ప్రాంతం నుండి నాగయ్య కళాక్షేత్రం వరకు యాత్ర.. సాయంత్రం బహిరంగ సభ.. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
* అనకాపల్లి జిల్లా: నేడు మాడుగుల నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. కోటపాడు(మం)లో నాడు నేడు కింద అభివృద్ధి చేసిన హాస్పిటల్ పరిశీలన.. ఘాట్ రోడ్డు జంక్షన్లో బహిరంగ సభ..
* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..
* ప్రకాశం : యర్రగొండపాలెంలో PACS వారి IOCL పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* కర్నూలు: తుగ్గలి మండలం కరువు మండలాల జాబితాలో చేర్చలేదని నేడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన
* తిరుమల: 5 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,710 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,205 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.13 కోట్లు
* గుంటూరు: నేడు పొగాకు బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న యశ్వంత్ కుమార్..