* ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023లో నేడు రెండు మ్యాచ్‌లు.. ఉదయం 10.30 గంటలకు బెంగళూరులో న్యూజిలాండ్‌తో తలపడనున్న పాకిస్థాన్.. మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లాండ్‌తో తలపడనున్న ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లో మ్యాచ్
* సిద్దిపేట: నేడు కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్.. నామినేషన్ పత్రాలు స్వామి వారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు.. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు.. ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్.. 38 ఏళ్లుగా కొనాయిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేస్తున్న సీఎం
* మెదక్: నేడు నర్సాపూర్ లో హోంమంత్రి మహమూద్ అలీ పర్యటన.. మైనారిటీల ఆత్మీయం సమ్మేళనంలో పాల్గొననున్న హోం మంత్రి మహమూద్ అలీ
* అమరావతి: ఈ రోజు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర డే-7.. బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలు.. ఎస్ కోట – విజయనగరం జిల్లా, గుంటూరు ఈస్ట్ – గుంటూరు జిల్లా, ధర్మవరం – శ్రీ సత్యసాయి జిల్లా
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,048 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 24,666 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు
* తిరుమల: 12వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. 17న నాగుల చవితి కారణంగా పెద్దశేష వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. 19వ తేదిన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
* ప్రకాశం : ఒంగోలుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* తిరుమల: రేపు శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి.. ఇవాళ రాత్రికి రచనా అతిధి గృహంలో బస చేయనున్న గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు.. రచనా అతిధి గృహంలో బస చేసిన మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణంలో జి.వి. మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. . చాగల్లు మండలం నెలటూరు గ్రామంలో శ్రీ సీతా రామ కళ్యాణ మండపంలో నిర్వహించే ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి?’ సమావేశాన్ని చాగల్లు మండల నాయకులు, ప్రతినిధులతో నిర్వహిస్తారు. చాగల్లు సచివాలయం-2 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (154వ రోజు) నిర్వహిస్తారు.
* శ్రీ సత్యసాయి: ధర్మవరం పట్టణంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర .. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కోనసీమ తిరుమల వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు మహాపుష్పయాగ్ సహస్రదీపాలంకరణ కోదండరామ అలంకరణలో హనుమద్వాహన సేవ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మకూరులో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* విశాఖ: నేడు సిపిఎం పార్టీ ‘‘ప్రజారక్షణ భేరి బస్‌యాత్ర’’.. పూర్ణామార్కెట్ దగ్గర బహిరంగ సభ, పాల్గొననున్న రాష్ట్ర నాయకత్వం.
* అనంతపురం : జేఎన్టీయూలో ధర్మవర్థిని సంస్థ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు చాగంటి కోటేశ్వరరావు అధ్యాత్మిక ప్రవచనాలు.
* తిరుపతి: నేడు సీపీఎం పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ భేరి బస్సు యాత్ర.. తిరుచానూరు వద్ద బహిరంగలో పాల్గొనున్న మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, డి రమాదేవి, వి కృష్ణయ్య
* ఏలూరు: నేడు చింతలపూడిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం.. కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి మేరుగా నాగార్జున, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా
* పశ్చిమగోదావరి జిల్లా: తణుకు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
* కర్నూలు: నేడు దళితులపై దాడులకు నిరసనగా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన
* తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలోని 232 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం-నగరపాలక సంస్థ కమిషనర్ కే. దినేష్ కుమార్
* కరీంనగర్: నేడు మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్న బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం.. కిషన్‌రెడ్డితో పాటు కుంగిన లక్ష్మీబ్యారేజీని విజిట్ చేయనున్న బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డా. లక్ష్మన్, రఘునందన్‌రావు..