* ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ 2023: నేడు నెదర్లాండ్స్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఢీ.. లక్నోలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్
* ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం.. ఇబ్బందిపడుతున్న ఢిల్లీ వాసులు.. కాలుష్యం పెరగటంతో నేటి నుంచి ప్రైమరీ క్లాసులకు సెలవులు.. ఆన్‌లైన్‌లో క్లాసులు కొనసాగించాలని రాష్ట్ర సర్కార్ ఆదేశాలు
* ఇవాళ శాసన సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ ఉదయం 11 గంటల నుండి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ.. ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.. నామినేషన్ స్వీకరణకు చివరి గడువు 10వ తేదీ.. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన, ఈనెల 15 వరకు నామినేషన్లు ఉపసంహరణ చివరి గడువు.. ఈనెల 30న పోలింగ్. వచ్చే నెల 3న ఓట్ల కౌంటింగ్.
* జనరల్, బీసీ అభ్యర్థుల డిపాజిట్ 10 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల డిపాజిట్ 5 వేలు.. అభ్యర్థి నామినేషన్ వేసే ఒక్క రోజు ముందు రాష్ట్రంలోని ఏదైనా బ్యాంక్ లో ఎన్నికల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఓపెన్ చెయాలి. ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతాను నామినేషన్ తోపాటు ఆర్వో కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఎన్నికల కోసం ప్రతి ఖర్చు ఈ ఖాతా నుండే చేయాలి. ఇవాళ్టి నుండే అభ్యర్థి ఖర్చు ను లెక్క కట్టనున్న వ్యయ పరిశీలకులు.
* సిద్దిపేట : ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో నేటితో ముగియనున్న రాజశ్యామల యాగం.. మూడో రోజు పూజ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్ దంపతులు.. పూర్ణాహుతితో రాజశ్యామల యాగం ముగింపు
* నేడు జగిత్యాల జిల్లాకు సీఎం కేసీఆర్.. కోరుట్ల శివారులో మధ్యాహ్నం జరగనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న కేసీఆర్.. సీఎం సభ సందర్బంగా మ.3 గంటల నుండి సా.6 గంటల వరకు వాహనాల దారి మళ్లింపు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు…
* నిర్మల్: నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. ముదోల్ నియోజక వర్గం భైంసాలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం
* నిజమాబాద్ : నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఆర్మూర్ నియోజకవర్గం ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
* రాజన్నసిరిసిల్ల జిల్లా: ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* నేడు సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దంపతుల పర్యటన .. గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఈటల రాజేందర్.. ఆయనకు మద్దతుగా పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్న ఈటల సతీమణి జమున
* కామారెడ్డి : నేడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటన.. జిల్లా కేంద్రంలో నిర్వహించే బూతు స్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొననున్న కిషన్ రెడ్డి
* తిరుమల: ఈ నెల 12వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం
* ప్రకాశం : మార్కాపురంలో కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ ఎన్. తులసిరెడ్డి పర్యటన.. పూల సుబ్బయ్య భవన్ లో అఖిల పక్ష సమావేశం.. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలన..
* ప్రకాశం : కొనకనమెట్లలో ప్రత్యేక స్పందన కార్యక్రమం, పాల్గొననున్న కలెక్టర్ దినేష్ కుమార్..
* బాపట్ల : పంగులూరులో ప్రత్యేక స్పందన కార్యక్రమంలో పాల్గొననున్న కలెక్టర్ రంజిత్ పాషా..
* నెల్లూరు : కందుకూరులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజయవాడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: ఏ.ఎస్.పేటలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచిని ప్రారంభించనున్న ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి
* శ్రీ సత్యసాయి : ఈనెల 4న ధర్మవరంలో సామాజిక సాధికార బస్సు యాత్ర.
* శ్రీ సత్యసాయి : ఈనెల 7వ తేదీన పుట్టపర్తికి రానున్న సీఎం వైఎస్ జగన్.. డాక్టర్ వైయస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
* చిత్తూరు: కాణిపాకం ఆలయంలో అంకురార్పణతో వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
* కాకినాడ: అన్నవరం సత్యదేవుని ఆలయంలో కార్తీక మాసంలో ఏర్పాట్లపై నేడు చైర్మన్ అధ్యక్షతన సమన్వయ సమావేశం
* ఏలూరు: రేపు చింతలపూడిలో మంత్రి మెరుగ నాగర్జున పర్యటన.. చింతలపూడిలో నూతనంగా నిర్మించిన డా.బి. అర్. అంబేడ్కర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల పారంభోత్సవ కార్యక్రమానికి హాజరు..
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: కోనసీమ తిరుమలగా ప్రసిద్దీ గాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కార్యక్రమాలు.. ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవ చనము, ఋత్విక్ వరుణ, దీక్షాధారణ, విశేషార్చన, నీరాజనం, సాయంత్రం వాస్తు హోమం, ధ్వజప తాక హోమాలు, శేషవాహన సేవ
* అల్లూరి జిల్లా: మన్యంలో వర్షంలా కురుస్తున్న దట్టమైన పొగ మంచు.. వంద అడుగుల దూరంలో కనిపించని వాహనాలు.. పాడేరు 15, మినుములూరు 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు, సాయంత్రం పల్లకి సేవ