నేడు ఏపీలో జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో రుణాలను జమచేయనున్నారు. నేడు చెన్నైలో రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ పుస్తకాన్ని రాహుల్‌గాంధీ అవిష్కరించనున్నారు. అంతేకాకుండా శరద్‌పవార్, స్టాలిన్‌లతో రాహుల్‌గాంధీ భేటీ కానున్నారు. నేడు తొలివిడత మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 5 రెండవ విడత ఎన్నికలు జరుగనున్నాయి. రెండు విడతల్లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.…